మోడీ కూడా డబ్బులు పంచిన వాళ్లే.. జేసీ సంచలన వ్యాఖ్యలు
posted on Oct 3, 2016 @ 6:25PM
కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం ప్రధాని నుంచి నా వరకు అందరమూ డబ్బులు పంచినవాళ్లమేనంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రత్యేక హోదా గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ.. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి అని, బుద్ధి లేని వాళ్లే ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షలు గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. జగన్ దీక్ష లతో ఎవరికీ ప్రయోజనం ఉండదని, ఆ దీక్షల వల్ల ఆయన ఆరోగ్యానికే మంచిదన్నారు. ఇక, పాకిస్థాన్ గురించి మాట్లాడుతూ, పాకిస్థాన్ సమస్య వందేళ్లయినా ఇలాగే ఉంటుందని, పాక్ పై యుద్ధం ప్రకటించడమే మంచిదని అభిప్రాయపడ్డారు.