జయసుధకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ?

 

 

సికింద్రాబాద్ శాసనసభ్యురాలు, సినీ నటి జయ సుధ తన పార్టీలో చేరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది.


కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య తన విధేయతలను మార్చిన ఈ నటి ప్రస్తుతం జగన్ నుండి ఆహ్వానానికి ఎదురు చూస్తోంది.జగన్ పార్టీకి శాసనసభ్యుల అవసరం అధికంగా ఉన్న సమయంలో ముఖ్య మంత్రి పని తీరు బాగుందని ప్రకటిస్తూ, కాంగ్రెస్ లో ఉండిపోయిన జయ సుధ ను ప్రస్తుతం జగన్ తన పార్టీలోకి అనుమతిస్తాడా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకం గా మిగిలింది.



రాజకీయ హేమాహేమీలంతా జగన్ పార్టీలో చేరుతున్న సమయంలో ఆ పార్టీ నుండి తనకు ఆహ్వానం లభించే విషయంలో జయ సుధ కు కూడా కాస్త సందేహాలే ఉన్నాయి. తనకు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత వై ఎస్ అని, ఆయనంటే తనకు అభిమానమని ప్రకటించే ఈ నటి ప్రస్తుతం జగన్ పార్టీ నుండి ఆహ్వానం కోసం ఎదురు చూస్తోంది.

తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నానని విచారం వ్యక్తం చేసిన జయ సుధ, జగన్ పార్టీలో చేరేందుకు మధ్య వర్తులను పంపించి వారి నుండి సమాధానం కోసం ఎదురు చూస్తోంది.