మనకి ఈ సవాళ్లు ఎందుకు జానా..?
posted on Jun 24, 2016 @ 3:03PM
తెలంగాణ ప్రభుత్వం కనుక రైతులకు రెండో పంటను ఇస్తే తాను టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇంతకీ అంతటి సవాల్ విసిరింది ఎవరనుకుంటున్నారా. ఇంకెవరూ అటు కాంగ్రెస్ కు అనుకూలమా.. లేక టీఆర్ఎస్ కు అనుకులమా అన్నట్టు వ్యాఖ్యానించే జానారెడ్డి గారు. జానారెడ్డిగారే.... కొత్తగా ఇలాంటి సవాల్ ను తెలంగాణ ప్రభుత్వానికి విసిరారు. అయితే ఇప్పుడు ఇంత సడెన్ గా జానారెడ్డి గారు.. ఇలాంటి సవాల్ ఎందుకు విసిరారబ్బా.. అందునా టీఆర్ఎస్ పార్టీకి అని చర్చించుకుంటున్నారు.
ఎందుకంటే.. కాంగ్రెస్ నేత అయిన జానారెడ్డి.. అవ్వడానికి ప్రతిపక్షనేత అయినా.. అప్పుడుప్పుడు టీఆర్ఎస్ పార్టీపైన ప్రశంసలు కురిపిస్తూనే ఉండేవారు. ఒకవైపు పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై పొగడ్తలు కురిపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ జానారెడ్డి మాత్రం సత్య హరిశ్చంద్రుడు మాదిరి.. టీఆర్ఎస్ ను పొగిడేవారు. దీంతో జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్ష నేతగా వ్యవహిస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన జానా.. నన్ను అంత మాత అంటారా.. నేను పదవులకు రాజీనామా చేస్తున్నా.. అంటూ ఎన్నోసార్లు చెప్పారు. కానీ చేసింది మాత్రం లేదు. అందుకే తనను టీఆర్ఎస్ కోవర్ట్ అనే విమర్శలు వున్నాయి. ఇప్పుడు ఆ విమర్శల నుండి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నారేమో.. ఏకంగా తెలంగాణ సర్కార్ కు సవాల్ విసిరారు.
మరి జానారెడ్డి అయితే సవాల్ విసిరారు. మరి సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తారా..? అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉన్నదే అంతంతమాత్రం.. ఇక ఆ పార్టీ నేతలు చేసే సవాళ్లను టీఆర్ఎస్ నేతలు స్వీకరిస్తారా.. అందునా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే జానారెడ్డి సవాల్ ను... మరోవైపు అసలు మనకు ఈ సవాళ్లేందుకు జానారెడ్డి అనుకునేవారు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.