తప్పుడు రాతలు రాస్తున్నారు..
posted on Jun 24, 2016 @ 3:51PM
ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈసందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవాలని అన్నారు. కట్టుబట్టలతో హైదరాబాద్‌కు వచ్చామని అమరావతిని అభివృద్ధి చేసుకుందామని.. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించామని, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల ఎకరాల భూములిచ్చారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి 'స్విస్ ఛాలెంజ్' పద్ధతికి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపామని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న సచివాలయం కుంగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై పలు కథనాలు వచ్చాయి కూడా. ఆ వార్తలపై స్పందించిన చంద్రబాబు ‘సచివాలయం కుంగిపోయిందని దుర్మార్గంగా రాశారు’ అని మండిపడ్డారు. అంతేకాదు రాజధానిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ రాశారని.. లక్ష కోట్ల అవినీతి జరిగే అవకాశం, ఆస్కారం అక్కడ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వార్తలు రాస్తే ఇక్కడికి వచ్చే సంస్థల్లో, భూములిచ్చిన ప్రజల్లో అభద్రతా భావం కలుగుతుందని ఆయన అన్నారు. అటువంటి నేరాన్ని చేయొద్దని ఆయన హెచ్చరించారు.