60మంది తీవ్రవాదులు దేశంలోకి చొరబాటు..
posted on Aug 18, 2016 @ 1:07PM
కాశ్మీర్లోని లోయలో గత కొద్దిరోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాది బుర్హన్ వనీని ఎన్‌కౌంటర్ చేసినందుకు గాను కాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. దీంతో నెల రోజుల నుండి అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసి..కర్ఫ్యూ కూడా విధించారు. అయితే తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా ప్రకారం.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి నెలరోజుల్లోనే 60మంది తీవ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని తెలుస్తోంది. దక్షిణ, ఉత్తర కాశ్మీర్ లోని కుప్వార, ఉరి సెక్టార్ల గుండా తీవ్రవాదులు దేశంలోకి వచ్చారని వారు నిర్ధారించుకున్నారు. దీంతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినా తీవ్రవాదుల చొరబాట్లు పెరుగుతుండటంతో సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కూడా కర్ప్యూ విధించారు.
కాగా నిన్న భద్రతా దళాలపై దాడి చేసిన ఉగ్రవాదులు ముగ్గురు జవాన్లను చంపారు. అంతేకాదు ఈ దాడి చేసింది తామే అని హిజ్బుల్ ముజాయిదీన్ తీవ్రవాదులు ప్రకటించారు.