బీజేపీ నేత దారణ హత్య.. దుండగుల కాల్పులు
posted on Aug 18, 2016 @ 12:40PM
బీజేపీ నేత దారణ హత్యకు గురైన ఘటన బీహీర్లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ నేత అశోక్ జైశ్వాల్‌ను దుండగలు కాల్చి చంపారు. వివరాల ప్రకారం.. పట్నా శివారు ధనాపూర్ ప్రాంతంలో కొంతమంది దుండగలు అశోక్ జైశ్వాల్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూనే ఆయన చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు జైశ్వాల్ హత్యతో భాజపా వర్గాలు ఆందోళన చేపట్టాయి. రద్దీ ఉన్న చోట హత్య జరగడం.. రాష్ట్రంలో నేరగాళ్లు ఎలాంటి భయం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారనడానికి జైశ్వాల్ హత్యే నిదర్శనమని పార్టీ వర్గాలు తీవ్ర విమర్శలు చేశాయి. పలువురు భాజపా ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. అంతేకాదు స్థానికంగా నేడు బంద్‌కు పిలుపునిచ్చారు.