జైపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రయోనాలు కాపాడలేని అసమర్ధుడా?
posted on Aug 6, 2012 @ 5:30PM
మనరాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రుల్లో మల్లిపూడి మంగపతి పళ్లంరాజు పేరు బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన రక్షణ మంత్రిత్వ హోదాలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందరినీ కలుపుకుంటూపోవటమే కాకుండా కీలకమైన సమస్యల్లో తన వంతు పాత్ర పోషించేందుకైనా ప్రయత్నిస్తారు కాబట్టి. కాకినాడ పార్లమెంటు సభ్యునిగా ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని ఆయన తరుచుగా ఆవేదన చెందుతుంటారు. ఇంకో మంత్రి గురించి చెప్పుకుంటే జైపాల్‌రెడ్డి.
ఈయన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే నవ్వుతూ ఉండే పనికిమాలిన మంత్రి అని అన్నిపార్టీలు విమర్శిస్తున్నాయి. పైగా పెట్రోలియంశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఇప్పటి వరకూ ఎంపిగా తన సొంత ప్రాంతాన్నే అభివృద్థి చేయలేకపోయారన్న ఆరోపణలున్నాయి. అటువంటిది ఇక రాష్ట్రానికి ఆయన ఏమి చేస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెజీబేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌లో అధికభాగం గుజరాత్‌కు తరలివెళుతున్నందున మంత్రిగా కనీసం రిలయన్స్, గుజరాత్‌స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఆయన సమావేశమై విద్యుత్తు సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేయటానికి అవకాశం ఉంది.
అయినా సరే జైపాల్‌రెడ్డి ఆ తరహా ప్రయత్నాలేవీ చేయలేదు. కేంద్రంలో తనకున్న పలుకుబడి ఉపయోగించి రాష్ట్రంలో గ్యాస్ కోసం పడుతున్న ఇబ్బందులు పరిష్కరించే దిశగా ఆయన ఇసుమంత ప్రయత్నమూ చేయలేదు. తెలంగాణా ప్రాంతానికి చెందిన జైపాల్‌రెడ్డి ఉన్నా లేనట్లే అని తెలంగాణావాదులు విమర్శించారు. దీన్ని బట్టి ఆయన పనితీరును విశ్లేషించవచ్చు. ఏమైనా కానీ, రాష్ట్రంలో పనికిమాలిన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అంటే కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా మద్దతుపలుకుతున్నాయి. ఈ విషయాన్ని ఆ మంత్రి ఇకనైనా గుర్తిస్తే మంచిది. అయితే ఈయన అవసరం లేకుండా నేరుగా ప్రధాని సహకారం పొందాలని సిఎం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలు జైపాల్‌రెడ్డి పనితీరు ఎంత దారుణంగా ఉందో తెలియజేయటానికి!