క్రానికల్స్ కొంపముంచిన డక్కన్ ఛార్జర్స్ ?
posted on Aug 6, 2012 @ 5:42PM
గొలుసు పత్రికలైన డక్కన్ క్రానికల్, ఆంద్రభూమి ఆంగ్ల, తెలుగు,వార పత్రికలకు లిక్విడ్ క్రైసిస్ వచ్చిందని, మీడియాల కధనం. ఎప్పుడూ నష్టాలను చవిచూసే ఆంద్రభూమి దినపత్రిక ఇంకా నడుపుతున్నారంటే కారణం డక్కన్ క్రానికల్ లాభాలేనని చెబుతుంటారు.
ఆంద్రప్రదేశ్‌లో ఆంగ్లపత్రికలన్నింటికంటే డిసి సర్యులేషన్ అధికం. ఆంగ్లపత్రిక లాభాలతోనే మేనేజ్ మెంట్ ఆంద్రభూమిని నడుపుతున్నారని టాక్. అలాంటి డక్కన్ క్రానికల్ ఇప్పుడు చిక్కుల్లో పడిరదని రూమర్లు వస్తున్నాయి. అయితే కొందమంది యల్లో జర్నలిస్టులు కావాలనే ఈ రూమర్లు తెచ్చారని అంటున్న వారు కూడా లేకపోలేదు. 1,500 కోట్ల రూపాయలు నికర లాభం గల ఈ పత్రిక తన లాభాలన్నింటిని ఎక్కడ పెట్టిందనే ప్రశ్న ఉత్పన్నమైంది.
సంస్ధ ఛైర్మన్ టి.వెంకట్రామరెడ్డి తన గుర్రాల మీద, ఆడంబరాలమీద ఇంకా ప్రిమియర్‌లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో డెక్కన్ చార్జర్స్ మీద ఖర్చు పెట్టారని చెబుతున్నారు. డక్కన్ చార్జర్స్ ఓడిపోవడంతో వచ్చిన నష్టాల ప్రభావం పేపర్‌పై పడిరదని తెలిసింది. అయితే ఈ విషయాన్ని సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా)నిర్ధారించ వలసి ఉంది. డక్కన్ క్రానికల్ మౌనం అనేక ఊహాగానలుకు తావిస్తుంది. అయితే డక్కన్ క్రానికల్ తన నష్టాలను పూడ్చుకునేందుకు గానూ, రెలిగేర్ క్యాపిటల్‌నుండి తన వాటాలను అమ్మటం ద్వారా 1000 కోట్ల రూపాయలు తీసుకోవాలని ప్రయత్నింస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో 100 కోట్ల రూపాయలు రావడం కూడా కష్టమేనని మార్కెట్ వర్గాలు ఉటంకిస్తున్నాయి.
త్వరలోఉత్తరాదికి చెందిన ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా డక్కన్ క్రానికల్‌ను కొనుగోలు చేస్తుందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో డిసి ఉద్యోగులంతా భయాందోళనకు గురి అవుతున్నారు. ఏది ఏమైనా డిసి ఆంగ్ల పత్రికకు ఏమైది అనేది కచ్చితంగా తెలియాలంటే వారం పది రోజులు ఆగవలసి ఉంది.