వరంగల్ నిట్‌లో జైలు వాతావరణం
posted on Aug 18, 2012 @ 10:08AM
వరంగల్‌లోని నిట్ దేశంలోనే పేరుపొందిన సాంకేతిక విద్యాసంస్ధగా రూపొందింది. ఈనేపధ్యంలో పరిస్థితులను చక్కదిద్దుకోవటంలో డైరెక్టర్ విఫలమవుతున్నారు. ఈ ఏడాది ట్రిపుల్ ఈ అడ్మిషన్లు పూర్తయ్యి నెలరోజులనుండి క్లాసులు జరుగుతున్నా ఇంతవరకు ఏంటీ ర్యాంగింగ్ చర్యలేవీ కాలేజీ యాజమాన్యం చేపట్టలేదు. గత ఏడాది వైజాక్‌కు చెందిన బిటెక్ విద్యార్ధిని మాధురి ర్యాగింగ్ కారణంగా లేడీస్ హాస్టల్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
అంకుర్‌భరద్వాజ అనే జూనియర్ విద్యార్ధికూడా మెగా హాస్టల్ భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నప్పటికి ర్యాగింగ్ నివారణా చర్యలు మాత్రం నిల్.ప్రొఫెసర్లతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి రాత్రిళ్లు కూడా నిఘాపెంచాలి. కానీ ఇవేమీ నిట్‌లో ఇవేమీ కనిపించవు.సీనియర్లు ఎవరెవరు జూనియర్లను తమరూంలకు పిలిపించుకుంటున్నారో తెలియదు.సమస్యను పరిష్కరించడం కంటే ముందుగా మీడియాకు తెలియ కూడదనే అధికారులు జాగ్రత్తపడుతున్నారు.ఎన్‌ఆర్‌ఐ హాస్టల్‌లో విద్యార్ధులు తప్పతాగి కొట్టుకుంటున్నా ఏమీ పట్టనట్లు ఉంటారు.క్లాసు రూంలలోనే గంజాయి తెప్పించుకున్నా అడిగే వాళ్లే లేరు.నేడు సమాచర వ్యవస్దతో ప్రతీదీ బహిర్గతం అవుతున్నా నిట్‌లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. లోపల ఏమి జరిగినా బయటకు ఏమీ తెలియకూడదనేది నిట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆలోచన.ప్రస్తుతం నిట్ పరిస్థితి జైలుకన్నా దారుణంగా ఉందని సాక్షాత్తూ దానిలోని ఉద్యోగులే చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు చేపట్టాలని విద్యార్దులు, ఉద్యోగులు కోరుతున్నారు.