ఫలిస్తున్న బాబు బి.సి. వ్యూహం
posted on Aug 18, 2012 @ 10:03AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తనపార్టీని ముందుకు నడిపించడానికి కావల్సిన అన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. ముఖ్యంగా బిసిలకు రానున్న ఎన్నికలలో 100 సీట్లు కల్పిస్ తానని, బిసి నాయకుల మన్ననలు పొందుతున్నారు. బిసిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యికోట్లు మంజూరు చేస్తానని కూడా చెప్పారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు బిసిలకన్నా ఎస్ సి, ఎస్‌టిల కన్నా ఎక్కువ వెనుకబడిన వారు ముస్లింలే అని వారి అభివృద్దికి తెలుగుదేశం కట్టుబడి ఉంటుందని హామీలు కురిపించారు. యస్‌సి వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేస్తామని దానికి సంబందించిన బిల్లును కూడా ప్రవేశ పెడతామని కూడా ముందుకు సాగుతున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి తన మంత్రులపై సిబిఐ చార్జ్ షీట్లు పెట్టటంతో తల బొప్ పికట్టింది. ఏ నిముషానికి ఎవరి పేరు సిబిఐ బయట పెడుతుందోనని మంత్రులందరూ టెన్షన్‌తో ఉన్నారు.వారికి ఇప్పుడు వచ్చే ఎన్నికల సంగతటుంచి ఈ ఆగస్టు గండం గడిచేదెలా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలేవి పట్టని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఇందిరమ్మ బాటలో ఉన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్‌లోకూడా ఉత్సాహం కరువైంది. మొన్న రీఎంబర్స్‌మెంట్‌ను అమలు చేయాలంటూ విజయలక్ష్మి విద్యార్ధులకు మద్దతుగా దీక్ష చేపట్టటం కంటే ఇంకేమీ చేయలేదు. యస్ సి వర్గీకరణ మీద పెదవి విప్పటం లేదు. పార్టీ అద్యక్షుడు జగన్ జైల్లో ఉండటం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీని ఉత్సాహంగా ముందుకు నడపాలన్నా కష్టంగానే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌కు బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పడం ఎవరికీ తెలియటంలేదు. అయితే పార్టీ గౌరవాద్యక్షురాలు మాత్రంజగన్ బాబు వస్తాడు...వస్తాడు అని చెబుతూనే ఉన్నారు. త్వరిత గతిని నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్లకపోతే పార్టీకి కష్టమే.