జగన్.. ముఖ్యమంత్రివేనా!
posted on Sep 16, 2022 @ 3:32PM
ఒరేయ్ అబ్బాయ్! ఏంజేస్తున్నావురా? అని ఒకరోజు పొద్దుటే ఇంటిముందు నుంచి వెళుతోన్నవాడిని మామ్మ గారు అడిగారు. ఏంలేదండీ..ఏదో చిన్న దుకాణం పెట్టానన్నాడు. మరి మీ బావో ఎవరో చిట్‌ఫండ్ కంపెనీ పెట్టాడని విన్నాను మరి.. అవునండీ.. మా పెద్దబావ. మరీ బాగుంది.. మరి పెదనాయన సిని మాల్లో ఉన్నాడ టగా.. విన్నాను.. అవును మామ్మగారూ..అపుడపుడూ సినిమాలూ తీస్తుంటాడు.. మామ్మ గారికి కించిత్ ఆశ్చర్య మేసింది. చాలా రోజుల తర్వాత ఊళ్లకి వెళ్లే కుర్రాళ్లకు పెద్దమ్మలు ఎదురయితే వచ్చే ప్రశ్నావళి ఇదే. ఎవరేం చేస్తుంటే ఈమెకు ఎందుకు అనుకున్నాడు ఆ కుర్రాడు. ఈ సీన్ చాలా కాలం క్రితంది. కాలంతో పాటు వేగంతో పాటు అడుగులు వేస్తూ అనేక వ్యాపా రాల్లో స్థిరపడుతున్నారు. వృత్తి ఉద్యోగాలూ చేసుకుంటున్నారు. వ్యాపారం చేయవచ్చు, ఉద్యోగా లు చేసుకోవచ్చు. ఎవరు ఏమి చేస్తున్నా వారి ఆర్ధిక, సామాజిక స్థాయిని పెంచుకోవడానికే గాని ఇతరు లను కించపరచడానికి కానే కాదు. కానీ దానికి కులం రంగు పూయడం అనేది దుర్మార్గం. అసలా మాటకు వస్తే వ్యాపారం, పరిశ్రమలు పెట్టి రాణించడం అనేదానికి కులానికి సంబంధం లేదు. అంతా తెలివితేటలు, కాలానుగుణంగా మార్పులు చేర్పులు, కొత్తని ఆదరిం చడంలోనే ఉంది. అంతేగాని నూనెకొట్టు మీది, చిట్‌పండ్ మీది అని తిట్టుకుం టూ కూర్చుంటే అలా కూర్చునే ఉంటారన్నదానికి అనేకానేక ఉదాహ రణలూ ఉన్నాయి.
దురదృష్టమేమంటే, ఏదన్నా వ్యాపారంగురించి చర్చరాగానే అది ఫలానా కులంవారికే చెల్లింది అని పాసింగ్ కామెంట్ చేయడం అనాదిగా ఉంది. అనడం సులభం, చేయడమే కష్టం. వ్యాపారలావాదేవీల విషయంలో తెలివితేటలు, మార్కెట్ జాగ్రత్తలు తెలుసుకోవడంలోనే బుర్రపెట్టేవారికి అలాంటి పాసింగ్ కామెంట్లు వినేటంత సమయం అస్సలు ఉండదు. కానీ చాలాకాలం నుంచి నోరు జార్చుకునేవారిని చూస్తే మాత్రం ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కారణం, మోసానికి, అన్యాయానికి, దారుణాలకీ తావు లేని విధంగా తమ తమ వ్యాపారాలు చేసుకుంటూ కాస్తంతైనా సమాజానికి ఉపయోగపడుతున్నవారి మనసు చివుక్కుమనడం ఖాయం.
మరీ దారుణమేమంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవ్యక్తి అలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడమే. రాష్ట్రంలో ఎక్కడయినా సరే పాలు, పచ్చళ్లు, చిట్‌ఫండ్ వ్యాపారాలన్నీ మీవే, కాలేజీలూ మీవే ఇక ఎవ్వ రికీ వీలు లేదా అంటూ ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడటం అందునా అసెంబ్లీలో అనడం ఒక వర్గాన్ని పనిగట్టుకుని కించపరచడమే. ఇది ఎవ్వరూ సహించరు, ఇష్టపడరు. ముఖ్య మంత్రి నోటి నుంచి ఇలాంటి కామెంట్లను ఎవ్వరూ ఊహించరు. ఇది కేవలం ఉక్రోషం తాలూకు ప్రభావం. వాస్తవానికి ఎవరయినా ఏదయినా చేయవచ్చు. కాలంతోపాటు మనుషులు మారుతున్నారు. ఇంకా మారకుండా, అదే పాతచింతకాయపచ్చడి ఆలోచనతోనే మగ్గిపోతున్నవారిని సమాజం క్షమిం చదు. కంప్యూటర్ యుగంలో బతుకుతూ, ఊపిరాడని టైమ్‌టేబుల్ ప్రకారం జీవనం సాగిస్తున్న ఈ కాలంలో కులం, మతం గురించిన పెద్ద ఆలోచనలకు తావులేదు. మరీముఖ్యంగా ఇతరుల కుల, మత, వృత్తి, వ్యాపారాల గురించి తోచినట్టు కామెంట్లు ఎవరూ సహించరు కూడా.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు, ప్రజాసంక్షేమానికి పాటుపడాల్సినవారు, ప్రజాహితాన్ని కోరేవారు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం వారి విజ్ఞతకు అద్దంపడుతుంది. కులాల మధ్య పోరాటాలు ఏ విధంగానూ మంచిది కాదని సామాజిక శాస్త్రవేత్తలు, విద్యావంతుల మాట. ఈ కాలలో కూడా ఇలాంటి ఆలోచనలు చేసేవారిని, ప్రజలమధ్య చిచ్చుపెట్టేవారిని చరిత్ర క్షమించదు.