జైల్లో జగన్ తో ఖాకీల భేటీ !
posted on Dec 25, 2012 @ 11:59AM
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, చంచల్ గూడా జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ని ఇద్దరు పోలీస్ అధికారులు కలవడం వివాదాస్పదం అవుతోంది.
డబీర్ పురా ఇన్స్ పెక్టర్ రంగా రెడ్డి, సబ్ ఇన్స్ పెక్టర్ నరసింహా రావు లు నిన్న జైలులో జగన్ తో భేటీ అయినట్లు సమాచారం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై వి సుబ్బారెడ్డి జైలులో జగన్ ను కలిసారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే ఈ ఇద్దరు ఖాకీలు జగన్ తో ములాఖత్ అయినట్లు సమాచారం.
ఓ పోలీస్ అధికారి జైలులో ఉన్న ఓ విఐపి ఖైదీని కలవడం సాధారణ విషయం కాదు. దీనితో, ఈ సంఘటన వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే, ఎవరికీ అనుమానం రాకుండా సుబ్బారెడ్డి అక్కడ ఉన్న సమయంలోనే ఈ ఇద్దరూ జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ కధనాన్ని జైలు సూపరింటెండెంట్ కొట్టిపారేశారు. ఖైదీల రక్షణ కోసమే వారు వచ్చారని ఆయన వివరించారు.