విభజనకు 'జగన్' సపోర్ట్ !
posted on Sep 26, 2013 @ 12:56PM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు వీలయినంత ఎక్కువగా సహకరిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన ఒప్పందంలో భాగంగా బెయిలు మీద బయటకు వచ్చాడని జగన్ మీద విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రకటనకు ముందే సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాడు. ఇప్పుడు తాజాగా వాటిని ఆమోదించుకునేందుకు మొగ్గు చూపుతున్నాడు.
కాంగ్రెస్ సూచనల మేరకే జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే జగన్ పార్టీలో చేరి అనర్హత వేటుపడిన సీమాంధ్ర శాసనసభ్యులు 15 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు జగన్ పార్టీ టికెట్ మీద గెలిచిన 17 మంది కూడా రాజీనామాలు చేస్తున్నారు. అంటే మొత్తం 32 మంది. దీంతో సీమాంధ్ర ఎమ్మెల్యేల సంఖ్య 175 నుండి 143కు చేరుతుంది. అంటే తెలంగాణ (117)ఎమ్మెల్యేల కంటే సీమాంధ్ర ఎమ్మెల్యేలు కేవలం 26 మంది మాత్రమే ఎక్కువ అవుతారు. అందులో కొందరు వివిధ కారణాలతో గైర్హాజరయితే తెలంగాణ తీర్మానం సులభంగా నెగ్గుతుంది. సమైక్యవాదానికి కట్టుబడ్డందుకు జగన్ కు సీమాంధ్రలో ఆదరణ ఎలాగు ఉంటుంది. ఇటు తెలంగాణ ఏర్పాటు జరిగిపోతుంది.