మరాఠా నేతల మద్దతు కోరిన జగన్‌

 

రాష్ట్రన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరూతు దేశ పర్యటన చేపట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహారాష్ట్ర నాయకులను కలిశారు. సోమవారం ముంబై వెల్లిన ఆయన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను, శివసేన అధ్యక్షుడె ఉద్దవ్‌ఠాక్రేలను కలిసి తమకు మద్దతివ్వాలని కోరారు.

అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, ఏకపక్ష విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరణ కోరుతూ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, బాలశౌరిలతో కలిసి ముంబై చేరుకున్నారు. ముందుగా శరద్‌పవార్‌తో సమావేశం అయిన జగన్‌ తరువాత ఉద్దవ్‌ఠాక్రేతోను కలిసి దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు.