అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే

 

రాష్ట్ర ప్రజల మనోభావాలకు విలువనివ్వకుండా అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్ర పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ తీర్మానం లేకుం డా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

విభజన రాష్ట్ర ప్రజలందరికి సంబందించిన విషయం గనుక తప్పనిస సరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన మూడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలోను అసెంబ్లీ తీర్మాణాలను పరిగణలోకి తీసుకునే విభజన చేశారని ఆయన గుర్తు చేశారు. 371(డి), 371(ఇ) ఆర్టికల్స్ ను సవరించాలంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ అవసరమన్న ఆయన, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాము కూడా ఒప్పకోబోమని హెచ్చరించారు.