జగన్ తీరు పరమ రోత.. సైకో సీఎంకు ఎక్సపైరీ డేట్ దగ్గర పడింది: లోకేష్
posted on Aug 3, 2022 @ 9:34PM
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ దుష్ప్రాచారం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. వైసీపీ శ్రేణులే తమ పార్టీ తీరును నిరసిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష ప్రచారం వెనుక ఉన్నది జగనే. సర్వే నంబర్ కు, డోర్ నంబర్ కు తేడా తెలియని కిరాయిగాళ్లు తన చిన్నమ్మ మరణంపై చేస్తున్న విషప్రచారం వెనుక ఉన్నది ఏపీ సీఎం జగనేనని అన్నారు.
జగన్ క్రిమినల్ మనస్తత్వాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ రెడ్డికి ఇక ఎక్సపైరీ డేట్ దగ్గరపడిందన్నారు. జగన్ జీవితమంతా అసత్యాలు, అన్యాయాలు, అక్రమాలేనని విమర్శించిన లోకేష్ కోడి కత్తి డ్రామా, బాబాయ్ గుండె పోటు అంటూ ఆస్కార్ రేంజ్ నటనలతో గత ఎన్నికల ముందు సానుభూతి సంపాదించుకుని అధికారం చేజిక్కించుకున్నారనీ లోకేష్ పేర్కొన్నారు.
తప్పుడు సర్వే నంబర్లతో మా చిన్నమ్మ మరణంపై విషప్రచారానికి తెరలేపి అభాసుపాలయ్యారన్నారు. తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం పదవి కోసం సంతకాల సేకరణ చేసిన నీచ చరిత్ర జగన్ ది అని విమర్శించారు. ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ మరణాన్ని వాడుకున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత జనాన్ని దోచుకుని, నెత్తుటి కూడు తింటున్నారని దుయ్యబట్టారు.
చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంతో తాము విషాదంలో ఉంటే.. విషప్రచారం చేస్తూ వినోదం పొందుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికత గురించి మాట్లాడే అర్హత కూడా విజయసాయి రెడ్డికి లేదని అన్నారు.