Read more!

జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు.. సీజేఐకి న్యాయవాది లేఖ

ఏపీ జగన్ రాజధాని విషయంలో చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానుల విషయం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండానే రాజధానుల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కేసు  గత నెల 31న విచారణ జరగాల్సి ఉండగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, సీఎం జగన్ ఏపీ రాజధాని విశాఖనే అని ప్రకటించేశారు. త్వరలో అక్కడి నుంచే తాను పాలన సాగించనున్నట్లు చెప్పారు. ఏపీ మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉండగా జగన్ ఈ విధమైన ప్రకటన చేయడం కోర్టు ధిక్కారమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు.

ఏపీకి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారులను విశాఖకు రావల్సిందిగా కోరారు.  వచ్చే నెలలో విశాఖ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడి దారులను ఆహ్వానించేందుకు హస్తినలో గత నెల 30న  జరిగిన సదస్సులో జగన్ ప్రసంగించారు.  ఆ ప్రసంగంలోనే ఆయన రాజధాని విశాఖేనని ప్రకటించేశారు.  జగన్ ప్రకటన కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని విపక్షాలే కాదు.. న్యాయ నిపుణులు కూడా అంటున్నారు.

ఇప్పుడు ఇదే విషయాన్ని సుప్రం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు ఓ న్యాయవాది.  త్వరలో విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని ప్రకటించడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్  కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఏపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ విశాఖ రాజధాని అని ప్రకటించడం ద్వారా ఏపీ సీఎం జగన్  కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనీ, జగన్ పై సుమోటాగా చర్యలు తీసుకోవాలని ఆయన సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.