ఈడీ విచారణకు తలొంచిన జగన్?
posted on Jul 24, 2012 @ 2:42PM
మనీలాండ్రిరగ్, ఫెరా చట్టం కింద వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ అథ్యక్షుడు జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల వ్యవహారాన్ని ఈడీ విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విచారణ జరుగుతున్నప్పుడు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించటం తగదని న్యాయనిపుణుల సలహాలకు జగన్ తలొంచారు. ఈ బెయిల్ పిటీషను వెనక్కి తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటి దాకా జగన్ తన బెయిల్‌కోసం తీవ్రంగా ప్రయత్నిస్తునే ఉన్నారు. ఇటీవల హైకోర్టులో కూడా బెయిల్ కోసం ఆయన దాఖలు చేస్తే అక్కడ నిరాకరించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అప్పట్లో నిర్ణయించుకున్నారు.ఆ మేరకు పిటీషన్‌ను మూవ్ చేశారు.
అయితే ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ఈడీ) జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ప్రారంభించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో జగన్‌ను ఈడి విచారిస్తున్నది. ఈ విచారణ కోసం ఈడి బృందం చంచల్‌గూడా జైలుకు వస్తోంది. మనీలాండ్రిరగ్ వ్యవహారం గురించి జగన్‌కు ముందుగా ప్రశ్నావళి ఇచ్చి విచారించటం, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయటం వంటి ఈడి విధానాలు న్యాయపరంగా కనిపిస్తున్నాయి. దీంతో విచారణ జరుగుతుండగా బెయిల్‌కు ధరఖాస్తు చేసుకున్నట్లవుతుందని జగన్‌ను ఆయన న్యాయనిపుణులు హెచ్చరించారు. దీంతో సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని పిటీషను వాపసు తీసుకోవాలని తన న్యాయవాదులను జగన్ కోరారు. ఓ రకంగా చెప్పాలంటే ఈడీ పద్దతి ప్రకారం విచారణ చేపట్టడంతో జగన్ తలొంచినట్లు అయింది.