జగన్ ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ!
posted on Aug 21, 2022 @ 1:12PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరి కొద్ది గంటలలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం జగన్ హస్తిన పర్యటనను బయలుదేరుతారు. రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేసి సోమవారం (ఆగస్టు 22) ఉదయం పదిన్నర గంటలకు గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు.
ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలను కూడా సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే అందుబాటులో ఉన్న కొందరు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలసే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ద్రౌపది మర్ము అమరావతి వచ్చిన సందర్బంగా సీఎం జగన్ ఆమెకు తన నివాసంలో తేనేటి విందు ఇచ్చి సత్కరించారు.
ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో నూతన రాష్ట్రపతితో జగన్ మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు. ఆ తరువాత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ కర్ తోనూ సమావేశం కానున్నారు. కాగా ప్రధాని మోదీతో భేటీలో జగన్ కీలక అంశాల పైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్య..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై జగన్ మోడీతో చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇవి కాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా మోడీతో జగన్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీ సందర్భంగా ప్రదాని మోడీ చంద్రబాబుల భేటీ తరువాత విస్తృతంగా ప్రచారం అవుతున్న రాజకీయ సమీకరణాల మార్పు అంశంపై జగన్ ప్రధాని నుంచి క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.