రాష్ట్రక్యాబినెట్‌లో జగన్‌కోవర్టులు?
posted on Aug 7, 2012 @ 12:15PM
రాష్ట్రక్యాబినెట్‌లో జగన్‌కు సానుభూతిదారులైన ఏడుగురుమంత్రులు ఉన్నారని, వారు జగన్‌కు కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారని పీసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి అయిన బొత్స సత్యన్నారాయణ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మంత్రుల వల్ల అధికార రహప్యాలు, క్యాబినెట్‌లో జరిగే చర్చలు ఎప్పటికప్పుడు జగన్‌కు తెలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అద్యక్షుడు పీజెఆర్ సుథాకరబాబు కూడా ఇటువంటి ఆరోపణలే బహిరంగంగా చేయటం విశేషం.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏ మంత్రి అనుకూలమో, ఏ మంత్రి వ్యతిరేకమో కూడా తెలుసుకోని పరిస్థితి నెలకొని ఉందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు మంత్రులు తమ కొడుకులను ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించాలనుకుంటున్న అంశం బహిరంగ రహస్యంగా మారింది. కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని అయోమయ స్థితిలో చాలా మంది నేతలున్నారు. అలాంటి భయంతోనే కొంత మంది మంత్రులు జగన్‌పార్టీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. జగన్‌కు కోవర్టులుగా ఉన్న మంత్రులెవరో అధిష్టానానికి కూడా తెలిసినప్పటికి ప్రస్తుతం వారిని వివరణ అడిగితే లేనిపోని వివాదాలు చెలరేగుతాయని భయపడుతోంది. అందుకే ఈ విషయమై ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయెద్దని అధిష్టానం బొత్సకు సలహా ఇచ్చినట్లు తెలిసింది.