కిరణ్‌ను ఇరుకున పెడుతున్న బొత్స!
posted on Aug 7, 2012 @ 12:08PM
పీసిసి అధ్యక్షుడు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అయిన బొత్స సత్యన్నారాయణ అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇరుకున పెడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో కరెంటుకోతలు, గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇబ్బందికలిగించేలా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు ఆయన ప్రజలను క్షమాపణ కోరటమే కాకుండా ప్రస్తుత పరిస్థితికి, గ్యాస్ రాకపోవటానికి కారణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యమే అన్నట్లుగా మాట్లాడారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి మద్దతుగా మాట్లాడి మరోచర్చకు తెరలేపారు. జైపాల్‌రెడ్డి అసమర్థత వల్లే రాష్ట్రానికి రావలసిన గ్యాస్ మహారాష్ట్రకు తరలిపోయిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో బొత్సా సత్యన్నారాయణ ఆయన్ను వెనుకేసుకురావటం విశేషం.
ఒకవైపు కేంద్ర మంత్రిని వెనుకేసుకువస్తూ మరోవైపు ముఖ్యమంత్రికి ఇబ్బందులు కలిగేలా వ్యాఖ్యానించటంతో బొత్సా వ్యూహం ఏమై ఉంటుందా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నిజానికి వీరిద్దరి మద్య మొదటి నుంచి సఖ్యతకానీ, సయోధ్యకానీ లేదు. మద్యం సిండికేటుపై ఎసిబి దాడుల తరువాత వీరి మద్యా అగాథం మరింత పెరిగింది. అంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్ తనకు పనికిమాలిన శాఖ కేటాయించారంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీవ్ యువకిరణాల పథకాన్ని క్యాబినెట్‌లో చర్చించకుండానే కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని కూడా బొత్స ఆరోపించారు. కిరణ్‌కువ్యతిరేకంగా కొందరు మంత్రులను బొత్సా సత్యన్నారాయణ రెచ్చగొడుతున్నారని బోలెడు ఆరోపణలు వచ్చాయి. బొత్సా వైఖరితో తాను విసిగిపోయి ఉన్నానని కిరణ్‌కుమార్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది. అయితే బొత్సాను మాత్రం ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.