మంగళవారం జగన్ కు అప్పుల వారం!
posted on Aug 10, 2023 @ 10:33AM
2019 ఎన్నికలలో విజయం 151 స్థానాలలో విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం చేపట్టిన జగన్ పార్టీ వైసీపీ నాలుగేళ్ల తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే.. ఆ పార్టీలోముఖ్యమంత్రి జగన్ వినా మరో పేరు గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రాని పరిస్థితి. మొత్తంగా వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరాఖరికి మంత్రులూ కూడా డమ్మీలే. మొత్తంగా ప్రస్తుతం 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా గెలిచిన ఎమ్మెల్యేలలో నలుగురిని మినహాయిస్తే మిగిలిన వారంతా అదే పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. వారిలో ఓ పాతిక మంది మంత్రులు. ఆ మంత్రులలో ఓ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు. వీరికి తోడు ముఖ్య సలహాదారు, వందల సంఖ్యలో సలహాదారులు.. అయితేనేం అందరూ జీరోలే. ఎవరికీ నిర్ణయాధికారం ఉందని భావించలేం.
రాష్ట్రంలో ప్రాజెక్టులు పడకేశాయి. అభివృద్ధి అడుగంటింది. గతంలో పోలవరం కోసం చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మారిస్తే.. ఇప్పుడు జగన్ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చి తన హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పకనే చెబుతున్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉన్నపాటి అధికారం కూడా జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందని, జనం తమను ఎలా నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకూ కార్యక్రమంలో తాము ఎదుర్కొంటున్న నిరసన సెగలకు ఇదే కారణమని అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా సరే రాష్ట్ర ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి కానీ, గన్ సర్కార్ మాత్రం ఆదాయం సంగతి గాలికొదిలేసి అప్పుల కోసం వెంపర్లాడుతోందని విమర్శిస్తున్నారు. అ దేశం మొత్తంలో ఇలాంటి తిరోగమన విధానాలను అనుసరిస్తున్న, అవలంబిస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్ ప్రభుత్వమేననీ అంటున్నారు. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ ఒక్క జగన్ పార్టీ మాత్రమేనని చెబుతున్నారు.
వాస్తవానికి జగన్ హయాంలో మంత్రులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాత్రమే కాదు వ్యవస్థలు కూడా ఉనికిని కోల్పోయి డమ్మీలుగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. జగన్ ప్రభుత్వ విధానాలపై విపక్షాల విమర్శలకు మంత్రుల నుంచి దూషణలే సమాధానంగా వినిపిస్తాయి. పాతిక మంది మంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ప్రభుత్వ విధానాలపై మాట్లాడరు. అధికారుల నోటి నుంచి మాటలే రావు.
ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా? కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసి.. ( కాంట్రాక్టర్ ను మార్చాల్సిన అవసరం లేదనీ, పనులు వేగంగా జరుగుతున్నాయనీ పీపీఏ ( పోలవరం ప్రాజెక్టు అథారిటి చెప్పినా కూడా వినకుండా) చివరికి ఇప్పుడు కట్టలేమ చేతులెత్తేసే పరిస్థితికి జగన్ సర్కార్ దిగజారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధిని అటకెక్కించేసిన వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
విపక్షాల సభలకు తండోపతండాలుగా పోటెత్తుతున్న జన సందోహం కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది.గతంలో పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మార్చేస్తే.. ఇప్పుడు జగన్ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారని వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులుగా తెస్తున్నారంటే.. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందనడాకి ఇంత కన్నా రుజువేం కావాలన్న ప్రశ్నలు వినవస్తున్నాయి.