జగన్ పై సిబిఐ ఫైనల్ ఛార్జీషీట్
posted on Sep 16, 2013 @ 12:23PM
వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన సిబిఐ నేడు ఆఖరి ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశం వుంది. దీనిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్, కోల్‌కతా బేస్డ్ సూటుకేసు కంపెనీలు, సండూరు పవర్ వంటి అంశాలు ఉండనన్నాయని తెలుస్తోంది. ఇప్పటికె ఈ కేసులో సిబిఐ ఎనిమిది ఛార్జీషీట్స్ దాఖలు చేసింది.
చివరి ఛార్జీషీటులో మంత్రి గీతా రెడ్డి భవిష్యత్ కూడా తేలే అవకాశాలున్నాయంటున్నారు. సండూర్ పవర్, లేపాక్షి గీతా రెడ్డిని సాక్షిగా సిబిఐ ప్రస్తావించే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల దాఖలు సిమెంట్స్ అంశంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ సాక్షిగా ప్రస్తావించింది. తుది ఛార్జీషీటులో గీతా రెడ్డిని కూడా సాక్షిగానే పేర్కొనే అవకాశాలున్నాయని అంటున్నారు. వారు ఈ ఛార్జీషీటును ఇవాళ రేపట్లో దాఖలు చేసే అవకాశాలున్నాయి.