జగన్ అరెస్టు అన్యాయమంటూ సాక్షి బుక్ లెట్ లు?
posted on Jun 12, 2012 9:29AM
రాష్ట్రంలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచేందుకు సాక్షి పత్రిక ముద్రించిన బుక్ లెట్ లు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటుతున్నాయి. అలాగే జగన్ అరెస్టు అక్రమమంటూ ఆర్ధికనేరాలతో ఆయనకేమీ సంబంధం లేదంటూ పలురకాల వ్యాసాలను ఈ బుక్ లెట్ లో భాగంగా ముద్రించారు. ఇంతటితో ఆగకుండా సిబీఐ సోనియా చేతుల్లో విశ్వాసం ఉన్న ఓ ఏజెన్సీగా అభివర్ణిస్తూ పలురకాల వ్యాసాలూ అందులో కనిపిస్తున్నాయి. అందమైన రంగుల్లో కవర్ పేజీ వేసి మరీ ఈ బుక్ లెట్ ను విడుదల చేస్తున్నారు. ఈ బుక్ లెట్ ఈనాడు ముద్రించిన జగన్ ఆస్తుల విలువకు పూర్తి వ్యతిరేకమైన ఆధారాలతో రూపొందించినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. అయితే ఈ విషయంలో జగన్ కు తగిలిన మరో షాక్ ఏమిటంటే ఈ బుక్ లెట్ లను లక్ష కాపీలు ముద్రించి విడుదల చేసే సమయంలో రాజమండ్రి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకో గమ్మత్తు ఏమిటంటే మరో లక్షన్నర కాపీలు ముద్రణలో ఉన్నాయని తెలుసుకున్న పోలీసుల వాటి కోసం ఎదురుచూస్తున్నారు.