ఉప ఎన్నికల గెలుపే లక్ష్యంతో అక్రమాల నేపథ్యంలో
posted on Jun 12, 2012 @ 9:33AM
ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు అక్రమాల నేపథ్యం వైపు సాగుతున్నారు. వీరి పోకడ ఒకింత ఆన్దోలకరంగా ఉంది. తెలుగువన్.కామ్ గతంలో హెచ్చరించినట్లే అభ్యర్థులు తమ ప్రచారం, పార్టీలపై నమ్మకం వదులుకొని ఓటరల్ను కొనుక్కుంటున్నారు. ముగ్గురున్న కుటుంబానికి రాష్ట్రంలో అత్యధికంగా 15వేల 500రూపాయలు వెలకట్టారంటే ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి అక్రమాలు అందలమెక్కాయనటానికి? కులసంఘాలు, భావన సముదాయాల సంక్షేమ సంఘాలు, సామాజిక సేవాసంస్థలు, కళాకారుల సంక్షేమసంఘాలు, వర్తక సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ లు ఇలా ఒకటేమిటి నియోజకవర్గంలో పదిమంది కలిసే ప్రతిదాన్ని డబ్బు పంపిణీతో తమవైపు తిప్పుకోవటం కోసం అభ్యర్థులు కసరత్తులు చేస్తున్నారు. దీంతో సమాజాన్ని మంచివైపు నడిపించాల్సిన ఉపాధ్యాయసంఘాలు కూడా కొత్తగా ఓట్ల రాజకీయంలోకి వచ్చేశాయి. సమాజానికి బుద్ధులు నేర్పే గురువులు కూడా లొంగిపోయారు. దీంతో నేతలు మరింత రెచ్చిపోయి డబ్బు వెదజల్లి విజయం సాధించాం అని ధైర్యంగా చెప్పుకోగలిగేస్థాయి ఈ ఎన్నికల్లో కుదురుతోంది. ఆధారాల్లేకపొతే మాట్లాడలేని ఈసి సంగతి పక్కన పెడితే అక్రమాలకూ పాల్పదని పార్టీ అనేది లేదు. అయితే ఎక్కువగా ఈ అక్రమాలకూ తెగబడుతున్నది మాత్రం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీనే. మళ్ళీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో 16 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు జరిగిందని ఓటర్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాదిలో ఓటర్లకు డబ్బు పంచుతూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు దొరికారు. వీరి దగ్గర రూ.50వేలు దొరికాయి. ఇక ప్రకాశంజిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అడిగిందే తడవుగా మందు బాటిల్స్ అందజేస్తూనే ఉన్నారు. తాగుబోతు కదలటానికి వీలులేనంత చీప్ లిక్కర్ ను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరిట అందజేస్తుంది. అంతే కాకుండా ప్రతి ఇంటికీ మాంసం కూడా ఆ పార్టీ పంపించిందని తెలుస్తోంది.