దారి మళ్లించిన నిధుల మాటేమిటి జగన్?
posted on Sep 12, 2022 @ 10:45AM
తండ్రి ఇస్తున్నాడని పెద్దవాడు ఖర్చుచేసేస్తుంటే చిన్నవాడికి అందేదెలా? తమ్ముడికీ కోపం వస్తుంది. పెద్దవాడు లెక్కపత్తా లేకుండా ఖర్చుచేసేయడం గురించి తండ్రి అడగకూడదు, తమ్ముళ్లూ అడగవద్దం టే ఎలా కుదురుతుంది. ఏదో రోజు తండ్రికి లెక్కజెప్పాలి, బంధువుల ప్రశ్నలకీ సమాధానం చెప్పాలి గదా. కోట్లలో దారి మళ్లించేస్తే, తర్వాత ఇస్తాడులే అనుకున్నాకుదరదు. ఇపుడు ఏపీ ప్రభు త్వం విష యంలో ఇదే చిత్రం నడుస్తోంది. ప్రాయోజితపథకాల కోసం రాష్ట్రానికి వచ్చిన రూ.3,824 కోట్లు దారి మళ్లాయి. ఇంతవరకూ ఆ మొత్తాన్నిపథకాలు అమలు ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. దీనికితోడు, కేంద్రపథకాలకు అనుగుణంగా రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులనూ విడుదల చేయ ట్లేదు. ఫలితంగా కేంద్రం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు రాష్ట్ర ప్రజలకు దక్కడం లేదు.
కేంద్రసాయంతో, కేంద్రం అందించే రుణంతో చేపట్టే ప్రాజెక్టులూ రాష్ట్రంలో పట్టాలెక్కడం 2021-22 ఏడా ది మొత్తంలోనూ, 2022-23 ఆర్థికసంవత్సరం తొలి ఐదు నెలల్లోనూ కేంద్రం రూ.3,824 కోట్లను రాష్ట్రానికి ఇచ్చింది. ఆ నిధులను ఇప్పటి వరకూ సంబంధిత పథకాల అమలు ఏజెన్సీలకు ఇవ్వలేద ని స్వయం గా కేంద్ర ఆర్థికశాఖ కార్య దర్శి సోమనాథన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల కేంద్ర పథకాలేవీ సక్రమంగా అమలు కావట్లేదని ఆయన రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమూ తన వాటా నిధులను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలతో క్షేత్ర కేంద్ర పథకాలను అనుసంధానించగలిగిన వాటి పైనే ప్రస్తు తం రాష్ట్రం ఆసక్తి చూపుతోంది.
2022-23 బడ్జెట్ సిద్ధం చేసేటప్పుడే రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఈ విషయాన్నిఅన్ని ప్రభు త్వశాఖల అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర పథకాలతో అనుసంధానం కాకుండాఉన్న కేంద్ర పథకాలను అమలుచేయాలంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి స్థాయిలో అనుమతి తీసుకోవాలన్న నిర్ణ యం గతంలోనే జరిగింది. అప్పటినుంచి కేంద్ర పథకాల అమలు, రాష్ట్రంవాటా నిధులిచ్చే అంశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, జైకా సాయంతో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, ప్రపంచ బ్యాంకు సాయంతో చేపట్టే ప్రాజెక్టులకూ రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వకపోవ డంతో అనేక కీలక ప్రాజెక్టులూ పట్టాలకు ఎక్కట్లేదు.
రాష్ట్రంలో చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల్లో కేంద్రంకొన్నింటిలో 90%, మరికొన్నింటిలో 75%, 60% వరకూ తన వాటా నిధులిస్తోంది. వీటికిరాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వాటా భరించాలి. ఏటా కేంద్రం నుంచి ఇలాంటి నిధులు సుమారు రూ.20వేల కోట్లు వస్తాయని అంచనా. రాష్ట్ర వాటా రూ.12వేల కోట్ల వరకు ఇవ్వాలని చెబుతు న్నారు