యుఎస్ ఓపెన్ విజేత అల్కరాజ్
posted on Sep 12, 2022 @ 11:09AM
స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఒపెన్ 2022లో పురుషుల టెన్నిస్ విభాగంలో తొలి గ్రాండ్ స్లామ్ కిరీటాన్ని అతి పిన్న వయస్కుడైన కార్లోస్ అల్కరాజ్ దక్కించుకున్నాడు. 19 ఏళ్ల కార్లోస్ అల్క రాజ్ న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్‌లో కాస్పర్ రూడ్‌ను 4 సెట్లలో ఓడించాడు. ర్యాంకింగ్స్ చరిత్రలో నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి యువకుడిగా నిలిచాడు.
యూఎస్ ఓపెన్ విజయంతో కార్లోస్ అల్కరాజ్ 2005లో రాఫెల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచారు.అల్కరాజ్ కంటే ముందు 2001లో 20 సంవత్సరాల 9 నెలల వయస్సులో లేటన్ హెవిట్ అతి పిన్న వయస్కుడైన ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్, 23 ఏళ్ల నార్వే ఆటగాడు రూడ్ ఫైనల్లో తలపడ్డారు. తొలి సెట్ ను అల్కరాజ్ 6-4 నెగ్గి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. రెండోసెట్‌లో నార్వే ప్లేయర్ రూడ్ విజృంభించి, 4-2తో అధిక్యంలో నిలిచాడు. 6-2 తేడాతో ఆ సెట్‌ను నెగ్గి సమం చేశాడు. మరో ఛాన్స్ ఇవ్వకూడదని భావించిన రూడ్ ఆధిక్యం ప్రదర్శించగా.. అల్కరాజ్ 6-6 తో స్కోర్ సమం చేయడంతో ఈ సెట్ టైబ్రేకర్‌కు మళ్లింది. చివరగా 7-1 (7-6) తేడాతో అల్కరాజ్ మూడో సెట్ నెగ్గాడు. కీలకమైన నాలుగో సెట్‌లో రూడ్‌కు అల్కరాజ్ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. 6-3 తేడాతో నాలుగో సెట్ నెగ్గి కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధిం చాడు. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ నెగ్గిన అల్కరాజ్‌ను టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో నెంబర్ వన్ ర్యాంకు వరించింది.