అంతా అమ్మదయ ...ఖర్గే
posted on Oct 19, 2022 @ 6:03PM
కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్ల సేవను గుర్తించి పార్టీ అధ్యక్షపదవిని కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త అద్య క్షునిగా ఎన్నికయిన మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధినేత సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్క్షతలు చెప్పారు. ఆమె నాయకత్వంలో కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చామని అన్నారు. రాజ్యసభ ఎంపీగా పార్టీ తరఫున సభలో గళం వినిపించిన ఖర్గే పార్టీ అద్యక్షపదవి ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల అధారిటీ చైర్మన్ మధుసూదన మిస్త్రీ ఖర్గేను విజేత గా ప్రకటించారు. పార్టీ అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికలో మొత్తం 9,385 ఓట్లు పడగా, ఆయనకు 7,897 ఓట్లు, థరూర్‌కి 1,072 ఓట్లు వచ్చాయన్నారు. 416 ఓట్లు చెల్లలేదు.
అధ్యక్షునిగా ఈ నెల 26వ తేదీన పూర్తి బాధ్యతలు స్వీక రిస్తారు. ప్రస్తు తం భారత్ జోడో యాత్రలో ఉన్న పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ఖర్గే కు శుభాకాంక్షలు తెలిపారు. తనతో పార్టీ పదవికి పోటీపడిన శశి థరూర్‌ని కలిసి పార్టీని విజయపథంలోకి తీసికెళ్లడానికి అనేక అంశాలను చర్చిం చానని ఖర్గే అన్నారు. పార్టీ కార్య కర్తలుగా అందరం కలిసి పనిచేయాలని, పార్టీలో ఎవరు పెద్ద, చిన్నాలేరన్నారు. అందరం ఐక మత్యం తో దేశంలో మతమౌఢ్యంతో రెచ్చిపోతున్న శక్తులను అడ్డుకోవాలన్నారు.
ఈనెల 17వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం ఆయా రాష్ట్రాల నుంచి బ్యా లెట్ పెట్టెలను న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంట లకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని శశి థరూర్ వర్గం ఆరోపించింది. కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లింది. లక్నోలో లేని డెలిగేట్ల ఓట్లు పోలయ్యాయని, యూపీ నుంచి పోలైన అన్ని ఓట్ల ను చెల్లనివిగా పరిగణించాలని కోరింది.