పేరుమార్చగానే జాతీయపార్టీ కాదు.. ఎన్నికల కమిషన్
posted on Oct 7, 2022 @ 11:44AM
టీఆర్ ఎస్‌ను, బీఆర్ ఎస్‌గా పేరు మార్చేందుకు అనుమతించమని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ ఎస్ ప్రతిపాదనలు పంపింది. పార్టీ సర్వసభ్యసమావేశంలో ఆమోదించిన తీర్మానంతో పాటు, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాసిన లేకను కూడా గురువారం పంపించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మకు మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అందించారు.
టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని మాజీ ప్రధాన ఎన్ని కల కమిషనర్‌లు వీఎస్ సంపత్, సునీల్ అరోరా తెలిపారు పేరు మారినా బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ మాత్రమే అవుతుందని, అది జాతీయ పార్టీ కాదని చెప్పారు. నిబంధనల ప్రకారం జాతీయ పార్టీకి అవస రమైన ఓట్ల శాతం, సీట్లు వచ్చినప్పుడే దానికి జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. టీఆర్ఎ స్ పేరును బీఆర్ ఎస్ గా మార్చేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిస్తే ఎన్నికల గుర్తులు ఆర్డర్ ప్రకా రం ఆ పార్టీ ఎన్నికల గుర్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని సునీల్ ఆరోరా వెల్లడించారు.
కాగా, పేరు మారినంత మాత్రాన ఎన్నికల గుర్తు మారదని, అయితే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆ రాష్ట్రాల్లో అదే ఎన్నికల గుర్తుతో వేరే పార్టీ ఉంటే బీఆర్‌ఎస్ ఆ రాష్ట్రంలో తన ఎన్నికల గుర్తు మార్చుకోవాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీకి ఇతర రాష్ట్రా ల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే, బీఆర్‌ఎస్ పేరిట ఇప్పటికే మూడు పార్టీలున్నట్లు విలేకరులు వినోద్ కుమార్తో ప్రస్తావిం చగా పార్టీ పేరు వేరు, అబ్రివేషన్ వేరు అని బదులిచ్చారు. పార్టీ పేరు బిఆర్ ఎస్‌గా మార్చిన తర్వాత తెలం గాణ రాష్ట్ర సమితి పేరిట ఎవరూ రాజకీయ పార్టీని నమోదు చేసుకోరాదని, ఆ విషయాన్ని చట్టం చెబుతున్నదని వినోద్ కుమార్ తెలిపారు. మరోవైపు, ఈ నెల 14లోపు ఎన్నికల సంఘం గుర్తిస్తే బీఆర్ ఎస్ తరఫునే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని, లేదంటే టీఆర్‌ఎస్ పేరిటే అభ్యర్థి బరిలో ఉం టారని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు.