ఫార్మా కంపెనీ యజమాని ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు
posted on Jan 9, 2024 @ 11:44AM
తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ అభ్యర్థులు, నేతల ఇళ్లు కార్యాలయాలపై ఐటీ సోదాలు జరిగాయి. ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. నెల రోజుల పాలన సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులకు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ నేతల, బంధువుల పెట్టుబడులు ఉన్న ఫార్మా కంపెనీలపై ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.. బిజెపి బీ టీం ఆరోపణలు ఎదుర్కొంటున్నబి ఆర్ఎస్ ప్రోద్బలంతో దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. లోకసభ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. హైదరాబాద్ లో పెద్దయెత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో ఒక ఫార్మా కంపెనీ యజమాని కార్యాలయం, ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖాదికారులు సోదాలు చేస్తున్నారు. బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు... మంగళవారం ఉదయం నుంచి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట్, మొయినాబాద్ ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పెద్దయెత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో గ్లాండ్ ఫార్మా కంపెనీకి చెందిన కార్యాలయాలు, ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో కంపెనీ ప్రతినిధులు, వారి బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం.