ఈసీ సూచన చేదుగుళిక కాదేమో!
posted on Oct 5, 2022 @ 10:30AM
ఇంట్లోవాళ్లు ఎవరు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి, వెళ్లకూడదు, ఏం తినాలి.. వంటి ఆర్డర్లతో పెద్దావిడ వేధించుకుతినేస్తోందని కోడళ్లు మండిపడుతున్నారు. ఆమె మీద కోపమంతా పిల్లల మీద ప్రదర్శస్తున్నారు. ఓ రోజు పెద్ద కోడలు కూతురు వెళ్లి పెద్దామె కు చాలు నీ ఆధిపత్యం రవ్వంత ఎక్కువే చేస్తున్నావు, తగ్గించుకోమంది. ఎవరు ఏం చేయాలో అందరికీ తెలుసునంది. ఇలా ఉంది ఎన్నికలకమిషన్ మీద రాజ కీయపార్టీల తిరుగుబాటు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే పార్టీల ను అదుపులో పెట్టుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడం పట్ల మండిపడుతున్నాయి.
ఎన్నికల వాగ్దానాలపై అన్ని వివరాలు ఓటర్లకు తప్పనిసరిగా తెలియాలని ఎన్నికల కమిషన్ చెప్పడాన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధంగా జోక్యం చేసుకునే అధికారం ఈసీకి లేదంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ ప్రతి పాదన చేసిందని మండిపడుతున్నాయి. రాజకీయపార్టీలు వాగ్దానాలు, వాటి అమలుకు అవసరమైన ఆర్ధిక వనరుల సంగతి ఓటర్లకు ఖచ్చితంగా తెలియాలని ఈసీ పేర్కొన్నది. ఎన్నికల ప్రణాళికలులో రాజకీయపార్టీలు చేసే వాగ్దానాలు, వాటి అమ లుకు ఆర్థిక వనరులు వంటి అంశాల గురించి ఓటర్లకు తెలియాలని, అన్ని వివరాలను తెలుసుకుని, తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇది దోహదపడుతుందని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిపాదనపై అభిప్రా యాలను తెలియజేయాలని గుర్తింపుపొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయపార్టీలను కోరింది. దీనిపై స్పందించేందుకు ఈ నెల 18వరకు గడువు కూడా విధించింది. ఇందులో స్పందించడానికేముంది..తాము చెప్పిన మాటే శాసనంగా అమలు చేయాలని, తోక ఝాడిస్తే పార్టీ గుర్తులకే దిక్కండదన్న హెచ్చరికలా రాజకీయపార్టీలకు తోచింది. అందుకే పార్టీలు మండిపడు తున్నాయి. ఈసీ ఇలాంటి కండిషన్లు ఎలా పెడుతుందని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మీడియాతో మాట్లాడుతూ, ఇది ఎన్నికల కమిషన్ చేయవలసిన పని కాదన్నారు. పోటీతత్త్వ రాజకీయాల సారం, స్పూర్తిలకు ఇది విరుద్ధమని ఆరోపించారు. భారత దేశ ప్రజాస్వామ్యంలో ఇది మరొక పొరపాటు అవుతుందని చెప్పారు. గతంలో ఇలాంటి బ్యూరోక్రాటిక్ వైఖరి ఉండి ఉంటే, దశాబ్దాల నుంచి పరివర్తన తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలేవీ వాస్తవమయ్యేవి కాదన్నారు.
శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ,ఈడీ, సీబీఐ కార్యకలాపాలు గంపగుత్త తరహాకు మారు తున్నా యని, అదేవిధంగా ఎన్నికల ప్రజాస్వామ్యం, ఎన్నికల నిర్వహణ కూడా మసకబారుతోందని వ్యాఖ్యానించారు. ఓటర్లు తమ ఓటు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకుంటారని, ఆ ప్రభుత్వాలు అధికంగా ఖర్చు చేస్తే, తమ వాగ్దానాలను నిలుపుకోలేకపోతే, వాటిని ఆ ఓటర్లే గద్దె దించుతారని అన్నారు. ఇది కేవలం ఓటర్ల హక్కు అని చెప్పారు. ఈసీ తన బాధ్యతలను అతిగా నిర్వహి స్తోందన్నారు. సుస్థిరమైన అంతర్జాతీయ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతో జోక్యం చేసుకుంటోందని మండి పడ్డారు.
అభివృద్ధి లక్ష్యాలపై గొప్పలు చెప్పుకుని అధికారం చేపట్టినవారిని, ఉద్యోగ కల్పన, అభివృద్ధిపై ఇచ్చిన హామీలను నెరవేర్చ డానికి బదులుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని రోజులను పెంచినవారిని, ఉచిత రేషన్ స్కీమ్‌ను మరింత విస్తరించిన వారిని కూడా ఈసీ జవాబుదారీ చేయాలన్నారు. రాజకీయపార్టీలు అధికార దాహంతోనే ఉచితాలు ప్రకటించడం, ఓటర్లను ఆకట్టుకోవడంలో ఎడాపెడా హామీలు ఇవ్వడంవల్ల ప్రజలు ముందు ఆయా పార్టీల వెంట పడుతున్నప్పటికీ అధికారంలో ఉన్నంత కాలం అది చెల్లుబడి అవుతోంది. కానీ ఆర్ధిక మద్దతు కోసం కేంద్రాన్ని వేడుకోవడం వరకూ పరిస్థితులు దిగజార్చే హామీలు ఇవ్వడం దేనికన్నదే ఈసీ ప్రశ్న.
దీనికి రాజకీయపార్టీల నుంచి తగిన సమాధానం మాత్రం రావడం లేదని విశ్లేషకుల మాట. ఓట్లను అడిగేందుకు పార్టీలు, నాయకులు చేసిన కార్యక్రమాలు, పార్టీల అజెండాలో ప్రత్యేకతల్ని ప్రచారం చేసుకోవడం కంటే ఉచితాల ప్రకటనల మీదనే ఆసక్తి ఎక్కువ కనపర్చడం ఆ తర్వాత వాటని సమర్ధించుకోలేక వెనుకబడి ప్రజల దృష్టిలోనూ ప్రతిష్టతో పాటు అధికారం కోల్పోవడం జరుగుతోంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాల మీదకూడా వారి భారం పడుతోంది. చాలా సందర్భాల్లో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చి న పార్టీలు అంతకు ముందు పార్టీలు, ప్రభుత్వాలు ఇచ్చిన అర్ధంలేని పథకాల హామీలు అమలు చేయడానికి ఎంతో ఆలోచిం చాల్సివస్తోంది. కానీ ఇపుడు ఈసీ చేసిన హెచ్చరిక మాత్రం చేదుగానే రాజకీయపార్టీలు భావిస్తున్నాయి.