బీసీలకు జగన్ ఏం చేశారు... చంద్రబాబు
posted on Sep 22, 2022 @ 11:42AM
రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీయేనని, అంతకుముందు అంద రూ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు అన్నారు. నిజానికి ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమ యిందన్నారు. విజయవాడ ఎ కన్వెన్షన్ లో జరిగిన తెలుగు దేశం పార్టీ బిసి రాష్ట్ర విభాగం, సాధికార కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బిసిలలో నాయకత్వం తయారు కావాలని, 142 కులాల నుంచి నాయకత్వం కోసం సాధికార కమిటీలు పెట్టామని ఆయన అన్నారు.
బీసీలనాయకత్వం పెంచడానికే స్థానికసంస్థల్లో రిజర్వేషన్ పెట్టామని, ఎన్టీఆర్ 24 శాతం చేస్తే, తాము దాన్ని 34 శాతానికి పెంచామని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిల రిజర్వేషన్లను పది శాతం తగ్గాయన్నారు. జగన్ కారణంగా 16 వేల మంది బిసి సోదరులు పదవులకు దూరం అయ్యారు. టిడిపి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు...వైసిపి ఎందుకు అమలు చెయ్యలేకపోయిందని ప్రశ్నించారు. బిసి లకు సబ్ ప్లాన్ తెచ్చిన ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వమేనని అన్నారు. జగన్ ఏర్పాటు చేసిన 54 కార్పొ రేషన్ లు ఏం చేస్తున్నాయన్నారు. కార్పొరేషన్ ల ద్వారా ఒక్కరికి అయినా సాయం చేశారా అని ప్రశ్నిం చారు.
జగన్ ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా నేను సిద్దంగా ఉన్నామన్నారు. సిఎం జగన్ భయపడుతున్నాడు కాబట్టే జగన్ కు అసహనం...అసెంబ్లీలో కూడా అది జగన్లో కనిపించింది. వైసిపి నాయకులు ఇప్పుడు పిల్లులు అయ్యారని ఎద్దేవా చేశారు.
బటన్ అవుట్ కంటే బటన్ ఇన్ ఎక్కువ అయ్యిందని, ఎప్పుడో ఒక సారి జగన్ పొట్ట పగిలి అన్ని డబ్బు లు బయటకు వస్తాయని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీ కోసం ప్రత్యేకంగా మెడికల్ యూనివర్సిటీ తె చ్చింది ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పు తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బ తీయడమే. దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రాముఖ్యత ఇచ్చింది తామేనన్నారు. జగన్ అబద్దం చెపితే కనీసం అతికేటట్లు చెప్పాలన్నారు. నిజానికి తాము కాదనుకుంటే కడపకు రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా అని, హర్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ ఆర్ పేరు ఉండేదా అని అన్నారు. జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణకాంత్ వంటి వారి పేర్లుపెట్టి సంస్థలు నిర్మిం చామని. మళ్లీ అధికారంలోకి రాగానే అప్పు డు జగన్ రెడ్డి కథ చెపుతామని బాబు అన్నారు. మళ్లీ ఎన్టీఆర్ పేరు వర్సిటీకి పెట్టే వరకు నిద్ర పోయేది లేదన్నారు.