ఇరోమ్ షర్మీలా 16 ఏళ్ల దీక్షకు హెల్త్ సీక్రెట్ అదేనట..!
posted on Aug 10, 2016 @ 3:56PM
మణిపూర్ ఉక్కు మహిళగా పేరు పొందిన ఇరోమ్ షర్మిలా సాయుధ బలగాల అధికారాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 ఏళ్లు నిరాహర దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె తన ఆమరణ దీక్షను విరమించిందనుకోండి. అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే.. ఇన్ని సంవత్సరాలు దీక్ష చేపట్టిన ఆమె ఆరోగ్యంగా ఎలా ఉన్నారబ్బా అని అందరి డౌట్.. కేవలం ముక్కు ద్వారా పంపించిన ఫుడ్ ద్వారానే ఇన్ని సంవత్సరాలు ఉన్నారా అని అందరి సందేహాం.
ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలు ఎంటో చెబుతున్నారు ఆమె బంధువులు. ఇన్ని సంవత్సరాలు దీక్ష చేస్తూ.. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకోవడానికి ఆమె సంకల్పం.. దానికి తోడు యోగా.. నిత్యం యోగాభ్యాసనాలే కారణమట. ఆమె దీక్ష పూనుకోవడానికి రెండు సంవత్సరాలు ముందు నుండి ఆమె యోగాభ్యాసం నేర్చుకుందట. ఆమె సోదరుడు ఇరోమ్ సింగజిత్ చెబుతూ.. షర్మిల స్వతహాగా ప్రకృతి ప్రేమికులురాలు..పంతొమ్మిదేళ్ల వయసులో 'నేచర్ క్యూర్' సబ్జెక్టు చదివించింది. అందులోనే యోగా ఒక భాగం. అదే ఆమెను ముందుకు నడిపించిందని.. 'దృఢ సంక్పల్పం, యోగాలే ఆమెను శారీరంగా దృఢంగా ఉండేలా చేశాయని అన్నారు. అంతేకాదు వైద్యులు కూడా అదే చెబుతున్నారు. ఆమె యోగాతోపాటు క్రమంతప్పకుండా నడక కొనసాగించడమే ఆమె హెల్త్ సీక్రెట్ అని వైద్యులు చెబుతున్నారు. వాటితో పాటు ఆమెను ఆస్పత్రిలో చేర్పించినప్పటినుండి.. ముక్కుద్వారా...ఉడికించిన అన్నం.. పప్పు, కూరగాయలు ద్రవంలా చేసి ఎక్కిస్తున్నారు.
కాగా ఆమె దీక్ష విరమించుకొని రాజకీయాల్లో ఆరంగేట్రం చేయనున్నారు. తాను చేస్తోన్న డిమాండ్‌ను నెరవేర్చుకునే క్రమంలోనే తాను రాజకీయాల్లోకి రానున్నానని, మణిపూర్‌కి సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా.. తిండి తినకుండా ఒక రెండు రోజులు ఉండాలంటేనే కష్టం.. అలాంటిది పదహారు సంవత్సరాలు ఆమె దీక్ష చేసిందంటే నిజంగా అభినందిచాల్సిన విషయం. అందుకే ఆమె ఉక్కు మహిళగా పేరు పొందింది.