మొన్నటివరకూ ఉత్తరాధిన.. ఇప్పుడు దక్షినాధిన..
posted on Aug 10, 2016 @ 1:04PM
ఉత్తరాధిన దళితులపై దాడులు జరగుతుండటం చూస్తూనే ఉన్నాం.. ఏదో ఒక కారణంతో దళితులపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోమాంసం వివాదంపై దళితులపై దాడులు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకూ ఉత్తరాదికే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు నెమ్మదిగా దక్షిణాదికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఆవు వివాదం వెలుగుచూసింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా.. అమలాపురంలో జానకిపేటకు మోకాటి ఎలీషా..అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు చర్మకారులు. అయితే వారు ఓ చనిపోయిన ఆవును తీసుకెళ్లి చర్మ వలుస్తుండగా.. కొంతమంది వచ్చి.. ఆవును దొంగిలించి చర్మ వలుస్తారా..? అంటూ ఆగ్రహంతో వారిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకి సమాచారం అందిచంగా అసలు విషయం బయటపడింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇప్పుడు జిల్లా మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాడిని నిరసిస్తూ అమలాపురంలో దళిత సంఘాల నాయకులు రాస్తారోకోకు దిగారు.