రైల్వేశాఖ కొత్త నిర్ణయం.. టికెట్ల విషయంలో కూడా..
posted on Jan 29, 2016 @ 12:48PM
రైల్వేశాఖ ఈసారి మరో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న రైల్వేశాఖ మరో నిర్ణయం తీసుకొని ప్రయాణికులకు షాకిచ్చింది. అదేంటంటే.. సాధారణంగా ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇప్పటివరకూ మనకు ఐఆర్ సీటీసీ ద్వారా చేసుకునే వీలుంది. అది అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు టికెట్ బుక్ ఫెసిలిటీ పై కూడా ఆంక్షలు విధించింది రైల్వేశాఖ. మామూలుగా అయితే ఇప్పటివరకూ నెలకు పది టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. కానీ ఫిబ్రవరి 15 నుంచి వెబ్ సైట్ ద్వారా కేవలం ఆరు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో ప్రజలు రైల్వేశాఖ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఎక్కువ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సివస్తే అప్పుడు పరిస్థితి ఏంటని.. రైళ్లలో సౌకర్యాలు సరిగా చూసుకొని రైల్వేశాఖ.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ముందుంటుందని అంటున్నారు. మరి రైల్వేశాఖ ఇప్పటికైనా ప్రయాణికులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటుందో లేదా తమ పని తాము చేసుకుంటూ పోతుందో చూడాలి.