వైసీపీలో కుమ్ములాట ‘దర్శి’ నీయం!
posted on Aug 21, 2022 @ 5:11PM
ఒకే పార్టీ వారు మరీ చిన్నపిల్లల్లా గొడవపడటం వైసీపీలో ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటకు తాజా ఉదాహరణ దర్శి నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు మధ్య ఆధిపత్య పోరు తారా స్ధాయికి చేరింది. ఇంటి గృహప్రవేశాల కార్యక్రమాలకు హాజరుగాకపోవడం వంటి పనుల ద్వారా వారి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకున్నదీ తెలియజేశారు.
సహజంగా సొంత పార్టీలో గాని, ప్రత్యర్థి పార్టీలో నాయకుల్లో రాజకీయంగా మనస్పర్థలు ఉన్నా వారి కుటుంబాల్లో జరిగే కార్యక్ర మాలకు అందరినీ ఆహ్వానించటం, ఎదుటి వారు వెళ్లటం జరుగుతుంది. కానీ గత ఏడాదిగా దర్శిలో మద్దిశెట్టి, బూచేపల్లి మాత్రం ఆ విధంగా వ్యవ హరించటం లేదు. ఎమ్మెల్యే మద్దిశెట్టి గృహప్రవేశానికి వెంకాయమ్మ కాని శివప్రసాద్‌రెడ్డి గాని హాజరు కాలేదు. ఇటు బూచే పల్లి గృహప్రవేశానికి మద్దిశెట్టి గాని ఆయన సోదరులు కాని రాలేదు. పైగా రాష్ట్ర నాయకుల రాకపోకల్లో కూడా వ్య త్యాసం కనిపిం చింది. జిల్లాలోని ఉన్నతాధికారులు ఈ తలనొప్పి మనకెందుకులే అని రెండు చోట్లకు వెళ్లలేదు. అలాగే కొందరు వైసీపీ నేతలు కూడా అదే పంధా అనుసరించారు.
దీనికి తోడు బూచేపల్లి ఆహ్వానం మేరకు సీఎం చీమకుర్తి రానుండటం బూచేపల్లి వర్గంలో జోరును పెంచింది. మరోవైపు మద్ది శెట్టి కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మద్దిశెట్టి గృహప్రవేశానికి ముఖ్యఅతిధిగా వారి సామాజికవర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రి బొత్సా సత్య నారాయణ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. బూచేపల్లి గృహప్రవేశానికి మాజీమంత్రి, పార్టీ నేత బాలినేనితో పాటు జగన్ ప్రత్యేకంగా ప్రోత్సహించే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరుకావటం విశేషం. కారణాలు ఏమైనా బూచేపల్లి కార్య క్రమంలోనే ముఖ్య నాయ కులు, అధికారులు ఎక్కువగా కనపడ్డారు. ఎమ్మెల్యే గృహప్రవేశానికి వెళ్లలేకపోయిన బాలినేని ఆ తర్వాత వెళ్లి వచ్చేందుకు ప్రయత్నించగా తాను అందుబాటులో లేనని మద్దిశెట్టి చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ రెండు కార్య క్రమాలను పరిశీలిస్తే వైసీపీలోని కాపులు ఎమ్మెల్యే గృహప్రవేశ కార్యక్రమంలో, రెడ్లు అత్యధికులు బూచేపల్లి గృహ ప్రవేశ కార్యక్రమంలో కనిపించారు.
కాగా బూచేపల్లి ఆహ్వానం మేరకు సీఎం జగన్ 24న చీమకుర్తి రానుండటం ఆయనకు కలిసొచ్చింది. అయితే చీమకుర్తి ఎస్‌ఎన్ పాడు నియోజకవర్గంలో ఉండగా దర్శిలో బూచేపల్లి కార్యకర్తల సమావేశం నిర్వహించ టం విశేషం. రెండు రోజుల క్రితం దర్శిలోని ఆయన కొత్త గృహంలో బూచేపల్లి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్ పర్సన్ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే కు ఈ సమావేశం సమాచారం తెలుసో లేదో కూడా తెలియదు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మ్మెల్యే, ఇన్‌చార్జులదే పూర్తి అధికా రం అనేది వైసీపీ విధానం.
అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా బూచేపల్లి సమా వేశం నిర్వహించటం అందునా చీమకుర్తిలో జరి గే సీఎం సభను జయప్రదం చేయమని కోరడం విశేషం. తద్వారా అటు దర్శిలో ఇటు చీమకుర్తి ప్రాంతంలో బూచే పల్లి కుటుంబం పట్టు నిరూపించుకునే లక్ష్యంతో ఆయన ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇది పార్టీ నిబంధలనకు విరుద్ధమని ఎమ్మెల్యే ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాక బూచేపల్లి వర్గీయులను దెబ్బతీసే ఎత్తుగడలకు కూడా ఆయన సిద్దమయ్యారు.
ఎంపీపీ, జడ్పీటీసీ శుక్రవారం కురిచేడు మండలం కల్లూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహిం చా రు. ఆ కార్యక్రమానికి ఎంపీపీ, జడ్పీటీసీలు ఇద్దరూ గైర్హజరయ్యారు. జడ్పీటీసీ తొలి నుంచి బూచేపల్లి వర్గీయుడే. అయితే ఎమ్మె ల్యే మద్దిశెట్టి సామాజికవర్గానికి చెందిన ఎంపీపీ కూడా రాకపోవటం విశేషం. ఎంపీపీ కోటేశ్వరమ్మ, ఆమె పక్షాన రాజకీయం చేసే చంద్రశేఖర్‌రావులు ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు. నిన్న మొన్నటివరకు ఎమ్మెల్యే తోటి ఉన్నవారు బూచేపల్లి గృహ ప్రవే శా నికి హాజరవ్వటం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ విషయంపై ఎమ్మెల్యే కూడా ఎంపీపీని పార్టీ నాయకుడు చంద్ర శేఖర్ రావును మందలించటమే కాక దూరంగా ఉండమని పరోక్షంగా సంకేతాలు పంపినట్లు తెలిసింది. అలాగే వారికి గడప గడపకు సమాచారం ఇవ్వలేదంటున్నారు. ఇటు బూచేపల్లి కూడా జనసమీకరణ పేరుతో ఏర్పాటుచేసే సమావేశాలకు ఎమ్మెల్యే కు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా బూచేపల్లితో సన్నిహితంగా ఉండేవారికి చెక్ పెడుతున్న సంకే తాన్ని మద్దిశెట్టి ఇచ్చేశారు. దీంతో ఇటు మద్దిశెట్టి అటు బూచేపల్లి రాజకీయంగా ఢీ అంటే ఢీ అనుకునేందుకు సిద్ధమైనట్లు తేట తెల్లమవుతుంది