Read more!

 రిపబ్లిక్ డే పరేడ్ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్రదినోత్సవం  జరుపుకుంటారు.  ఈసారి భారతదేశం 74వ గణతంత్రదినోత్సవాన్ని జరుపుకుంటుంది. 26 జనవరి 1950 న, భారతదేశంలో రాజ్యాంగం అమలు చేయబడింది.  అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్రదినోత్సవంగా జరుపుకుంటాము.  గణతంత్రదినోత్సవం సందర్భంగా జరిగే పరేడ్ చాలా ఆసక్తిగా ఉంటుంది.  రిపబ్లిక్ డే పరేడ్ గురించి ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుంటే..

గణతంత్రదినోత్సవం రోజున  జరిగే కవాతును చూసేందుకు దాదాపు 2 లక్షల మంది వస్తారని మీకు తెలుసా ? ప్రతి సంవత్సరం గణతంత్రదినోత్సవం సందర్బంగా థీమ్ ను ప్రకటిస్తారు.  ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ "సామాన్య ప్రజల భాగస్వామ్యం." ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి హాజరవుతారు.

26 జనవరి 2024న రిపబ్లిక్ డే పరేడ్‌లో 12 రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలు,  తొమ్మిది మంత్రిత్వ శాఖలు,  విభాగాలు వాటి పట్టికను ప్రదర్శించడానికి సెలెక్ట్ చేశారు. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మేఘాలయ, పంజాబ్, ఉత్తరప్రదేశ్,  ఉత్తరాఖండ్ ఉన్నాయి.

జనవరి 26 న జరిగే కవాతు గురించి ఆసక్తికరమైన విషయాలు..

 1950 నుండి 1954 వరకు  26వ జనవరి కవాతు వరుసగా ఇర్విన్ స్టేడియం (ప్రస్తుతం నేషనల్ స్టేడియం), కింగ్స్‌వే, రెడ్ ఫోర్ట్,  రామ్‌లీలా మైదాన్‌లో జరిగింది.

 1955,  జనవరి 26 న జరిగే కవాతుకు రాజ్‌పథ్ శాశ్వత వేదికగా మారింది. ఆ సమయంలో రాజ్‌పథ్‌ను 'కింగ్స్‌వే' అనే పేరుతో పిలిచేవారు  ఇప్పుడు దీనిని కర్తవ్యాపత్ అని పిలుస్తున్నారు.

ప్రతి సంవత్సరం 26 జనవరి పరేడ్‌కు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి  ఏదైనా దేశ పాలకులను అతిథిగా ఆహ్వానిస్తారు. మొదటి కవాతు 26 జనవరి 1950న జరిగింది. ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్ణో  అతిథిగా ఆహ్వానించబడ్డారు. అయితే 1955లో రాజ్‌పథ్‌లో మొదటి కవాతు జరిగినప్పుడు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్‌ను  ఆహ్వానించారు.

జనవరి 26న జరిగే పరేడ్ కార్యక్రమం రాష్ట్రపతి రాకతో ప్రారంభమవుతుంది. అన్నింటిలో మొదటిది, రాష్ట్రపతి యొక్క కావలీర్ అంగరక్షకులు జాతీయ జెండాకు వందనం చేస్తారు మరియు ఈ సమయంలో, జాతీయ గీతం ప్లే చేయబడుతుంది.  21 గన్స్ సెల్యూట్ కూడా ఇవ్వబడుతుంది. కానీ 21 కానన్లతో కాల్పులు జరగవు, దీనికి బదులుగా, "25- పాండర్స్"  అని పిలువబడే భారత సైన్యం  7- ఫిరంగులను 3 రౌండ్లలో కాల్చడానికి ఉపయోగిస్తారు.

 గన్ సెల్యూట్ ఫైరింగ్ సమయం జాతీయ గీతం  సమయంతో సరిపోతుంది. మొదటి ఫైరింగ్ జాతీయ గీతం ప్రారంభంలో జరుగుతుంది. చివరి కాల్పులు 52 సెకన్ల తర్వాత జరుగుతుంది. ఈ ఫిరంగులు 1941లో తయారు చేయబడ్డాయి. సైన్యం యొక్క అన్ని అధికారిక కార్యక్రమాలలో వీటిని ఉపయోగిస్తారు.

 చివరి ఏడాది కవాతులో  ఈ  ఏడాది ఎవరు కవాతు చెయ్యాలనే విషయాన్ని అధికారికంగా తెలియజేస్తారు.  అప్పటి నుండి  కొత్త ఏడాది జనవరి 26న అధికారికంగా ప్రదర్శించడానికి ముందు వరకు   600 గంటల పాటు ప్రాక్టీస్ చేసి ఉంటారు.

 భారతదేశం యొక్క సైనిక శక్తిని చూపించే అన్ని ట్యాంకులు, సాయుధ వాహనాలు,  ఆధునిక పరికరాల కోసం ఇండియా గేట్ ప్రాంగణానికి సమీపంలో ఒక ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతుంది.

జనవరి 26న జరిగే కవాతు కోసం రిహార్సల్ కోసం ప్రతి బృందం  12 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.  అయితే జనవరి 26వ తేదీన  9 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే కవర్ చేస్తారు. న్యాయమూర్తులు పరేడ్‌లో కూర్చొని ఉంటారు.  పాల్గొనే ప్రతి సమూహానికి 200 పాయింట్స్  ఆధారంగా తీర్పు ఇస్తారు.  ఈ తీర్పు ఆధారంగా "ఉత్తమ కవాతు సమూహం"  టైటిల్‌ను అందజేస్తారు.

  జనవరి 26వ తేదీన జరిగే కవాతు కార్యక్రమంలో నిర్వహించబడే ప్రతి కార్యకలాపం ప్రారంభం నుండి చివరి వరకు ముందుగా నిర్ణయించబడుతుంది. అందువల్ల చిన్న పొరపాటు జరిగినా నిమిషం  ఆలస్యం అయినా   నిర్వాహకులకు భారీగా ఖర్చు అవుతుంది.

 కవాతు కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఆర్మీ సిబ్బంది 4 స్థాయిల విచారణను దాటాలి. వారి చేతులు లైవ్ బుల్లెట్లతో లోడ్ చేయబడలేదని నిర్ధారించుకోవడానికి వారి చేతులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

కవాతులో పాల్గొన్న శకటాలు దాదాపు 5 km/hr వేగంతో కదులుతాయి. ఈ శకటాల డ్రైవర్లు వాటిని ఒక చిన్న విండో ద్వారా డ్రైవ్ చేస్తారు.

ఈవెంట్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన భాగంగా"ఫ్లైపాస్ట్" నిలుస్తుంది. ఇది  వెస్ట్రన్ ఎయిర్‌ఫోర్స్ కమాండ్‌ నిర్వహిస్తుంది, ఇందులో దాదాపు 41 ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొంటాయి. కవాతులో పాల్గొన్న విమానం వైమానిక దళంలోని వివిధ కేంద్రాల నుండి బయలుదేరి నిర్ణీత సమయంలో రాజ్‌పథ్‌కు చేరుకుంటుంది.

 మహాత్మా గాంధీకి ఇష్టమైన పాట అయిన  “అబిడ్ విత్ మి” రిబబ్లిక్ డే ప్రతి ఈవెంట్ లో ప్లే చేసేవారు. ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది.

 2014 పరేడ్‌లో జరిగిన పరేడ్ ఈవెంట్‌లో సుమారు 320 కోట్ల రూపాయల ఖర్చు జరిగింది. 2001లో ఈ ఖర్చు దాదాపు 145 కోట్లు. ఈ విధంగా, 2001 నుండి 2014 వరకు జనవరి 26 కవాతుపై చేసిన వ్యయం 54.51% పెరిగింది.

 బీటింగ్ రిట్రీట్ వేడుక జనవరి 29 వ తేదీన విజయ్ చౌక్‌లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్,  నేవీ బ్యాండ్‌ల ప్రదర్శనతో జరుగుతుంది. ఇది భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపును సూచిస్తుంది.

                                            *నిశ్శబ్ద.