ఇందిరమ్మ యాప్ పథకం యాప్ ప్రారంభించిన షర్మిల
posted on Mar 10, 2024 @ 1:38PM
తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తామని ప్రకటించారు.
ఇవాళ లాంచ్ చేసిన యాప్‌లో అర్హులైన కొందరు మహిళల వివరాలు పొందపరచామని, అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరిస్తామని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా ఉండాలని ఉద్దేశంతో ఈ పథకం రూపొందించామని వైఎస్ షర్మిల ట్విట్టర్‌లో తెలి పారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీలో జవజీవాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసుకోబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో పార్టీపై సానుకూల దృక్పథం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా, ‘ఇందిరమ్మ అభయం’ పథకం యాప్‌ను లాంచ్ చేశారు. యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా అర్హులైన కొందరు మహిళల వివరాలను అందులో పొందుపర్చారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేదింటి మహిళలకు సాధికారత కల్పించేందుకే ‘ఇందిరమ్మ అభయం’ పథకం తీసుకొచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ. 5 వేలు అందిస్తామని తెలిపారు. పేద కుటుంబాలను ఆదుకొనేందుకే కాంగ్రెస్ ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.