ఇందిరాకు సోనియా అంటే ఇష్టం.. మేనకాగాంధీ సహాయంగా ఉండాలనుకున్నారు...
posted on May 13, 2016 @ 11:58AM
దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి తన పెద్ద కోడలు సోనియాగాంధీ అంటేనే ఇష్టమట.. ఈ విషయం ఇందిరా గాంధీ వ్యక్తిగత వైద్యుడు కె.పి మాథుర్ రాసిన ‘ద అన్‌సీన్ ఇందిరాగాంధీ’ పుస్తకంలో వివరించారు. గతంలో రెండో ప్రపంచ యుద్దంలో సమయంలో ఇందిరా గాంధీ ఏం చేశారో చెప్పిన కె.పి.మాథుర్ ఇప్పుడు తన పుస్తకం ద్వారా మరో కొత్త విషయాన్ని చెప్పారు. ఇందిరా చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మరణానంతరం.. చిన్న కోడలు మేనకాగాంధీ తనకు సహాయంగా ఉండాలని కోరుకున్నారంట. కానీ మేనకా మాత్రం ఇందిరా పెద్ద కొడుకు రాజీవ్ గాంధీకి వ్యతిరేక వర్గంలో ఉండటంతో ఇందిరాకు దగ్గర కాలేకపోయారట. ఇక రాజీవ్, సోనియా వివాహం తరువాత ఇందిరా, సోనియా ఇద్దరూ చాలా తొందరగా కలిసిపోయారట. సోనియాపై ఇందిర ఆపేక్ష, మక్కువ చూపేవారట. మరి ముందుముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.