రోజు కూలీలకు ఐటి నోటీసులు
posted on Nov 8, 2013 6:27AM
వేల కోట్లు కొల్లగొట్టిన వారిని హాయిగా బయట తిరగనిస్తున్న ఆదాయపన్ను శాఖ రోజు కూలీతో బతికే బడుగు జీవుల మీద కొరడా జులిపిస్తుంది. కేవలం బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారంతో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలను ఐటి నోటిసులతో వేదిస్తుంది.
ఇందులో భాగంగానే పిల్లల చదువుల కోసం, దూర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి ఖాతాలకు డబ్బు పంపించిన వారికి ఈ మధ్య నోటీసులు జారీ చేసింది ఆదాయపన్నుశాఖ. పాన్ నెంబర్ లేకుండా ఏడాదిలో రూ.5 లక్షలకు మించి జరిగిన లావాదేవీలకు లెక్కలు చూపాలని నోటిసులో పేర్కొంది. దాదాపు ఆరువేల మందికి ఇటువంటి నోటీసులను జారీ చేసింది.
అయితే విచిత్రం ఏంటంటే ఇందులో దాదాపు 1200 మంది దిగువ మద్యతరగతి ప్రజలు ఉండగా, 14 మంది కేవలం రోజు కూలి మీద బతికే బడుగుజీవులు ఉన్నారు. వారి పిల్లల చదువుకోసమో లేక వ్యవసాయం చేసుకోవడానికి అప్పుగానో తామీ సొమ్ముతీసకున్నామని బాదితులు చెపుతున్నారు. అయితే అప్పు ఇచ్చిన వారి వివరాలైన తెలియజేయాలని ఐటి కోరుతుండటంతో ఇక పై తమకు సాయం అందటం కూడా కష్టం అంటున్నారు బాదితులు.