వర్షాకాలంలో ఈ ఆహారాలు తీసుకోండి.. ఇమ్యూనిటీ సూపర్ గా పెరుగుతుంది..!
posted on Aug 28, 2025 @ 9:30AM
వర్షాకాలం వేడి నుండి చాలా ఉపశమనాన్ని తెస్తుంది. కానీ దాన్ని ఆస్వాదించే లూపే ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వాతావరణంలో పెరిగిన తేమ ఇన్ఫెక్షన్ కలిగించే జీవులు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందువల్ల రోగనిరోధక శక్తిని ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల శరీరం జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. వర్షాకాలంలో ఇమ్యూనిటీ బంలగా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారాల గురించి తెలుసుకుంటే..
వర్షాకాల తీసుకోవాల్సిన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు
పసుపు..
దాని శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. పసుపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వర్షాకాలంలో పసుపు పాలు తాగుతూ ఉంటే ఇమ్యూనిటీ చాలా మెరుగ్గా ఉంటుంది.
సిట్రస్ పండ్లు..
నారింజ, నిమ్మకాయలు, జామ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ఇవి చాలా అవసరం.
ఉసిరి..
ఇండియన్ గూస్బెర్రీ అని ఉసిరి కాయను పిలుస్తారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉసిరికాయను పచ్చిగా, రసంగా లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు.
మునగ ఆకులు..
ఆహారం ద్వారా వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి మునగ సహాయపడుతుంది. మునగ ఆకులు కాలేయ ఆరోగ్యాన్ని పెంచడానికి, కడుపు నొప్పిని తగ్గించడానికి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.
ప్రోబయోటిక్ ఆహారాలు..
పెరుగు, మజ్జిగ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.
తులసి..
తులసి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. తులసి ఆకులను నీటిలో మరిగించి తీసుకోవచ్చు. లేదా తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు.
వెల్లుల్లి..
రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు వెల్లుల్లి చాలా ప్రసిద్ధి. వెల్లుల్లిని వంటలలో జోడించడం కంటే కూడా పచ్చిగా తినడం చాలా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...