హూ ని లాక్కెళిపోయిన హైడ్రోజన్ బెలూన్!
posted on Sep 11, 2022 @ 3:07PM
ఉచిత ప్రయాణం అంటే దూర ప్రాంతాలకు వెళ్లే జనాలు ఉన్నా రు. కొత్త కొత్త ప్రాంతాలు తిరిగి రావచ్చన్న సరదావారిది. కొంద రు మతిమరుపు ఆభరణం వల్ల బస్సులో వేరే ప్రాంతాలకు వెళిపో తుంటారు. మరికొందరు మాట ల్లోపడి స్టేషన్ వచ్చినా గమనిం చు కోరు. అలా వెళుతూం టారు. ఎవరో చెబితేగాని అలాంటి వారికి స్పృహ రాదు. కానీ ఈ చైనా మనిషి హైడ్రోజన్ బెలూన్ లో ఏకంగా తన ప్రాంతం నుంచి 320 కి.మీ దూరం వెళిపోయాట్ట.
చైనా హిలొంచియాన్ ప్రాంతానికి చెందిన రైతు హు. అతనికి పైన్ తోట ఉంది. పైన్ నట్స్ కోయ డానికి హైడ్రోజన్ బెలూన్ ఉప యోగిస్తుంటాడు. అందులో తిరు గుతూ పెద్ద వృక్షాల ఆకులు, గింజలు కోస్తుంటాడు. ఈమధ్యనే ఒకరోజు అతని స్నేహితుడితో కలిసి మామూలుగా వెళ్లినట్టే వెళ్లాడు. కానీ బెలూన్ అతన్నిం చీ అదుపుతప్పి దూరంగా వెళి పోయింది. ఇక దాన్ని తన పట్టు లోకి తెచ్చుకోలేకపోయాడు హు. అంతే అది అలా ఆకాశంలో అది ఏకంగా 320 కి.మీ తీసుకెళిపోయింది. అయితే అతనితో ఉన్న మరొక వ్యక్తి మరీ ఎత్తు ఎగరడానికి ముందే భయంతో కిందకి దూకేశాడు. ఏవో చిన్న గాయాలతో బయటపడ్డాడు. కానీ హూ మాత్రం అలా బెలూన్‌లో ఉండిపోయాడు.
బెలూన్‌ని కిందకి తీసుకురావడానికి అతని అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో హూ ఏకంగా రెండు రోజులు ఆ బెలూన్‌లోనే తిరిగాడు. ఆకలి, దాహంతో నీరసం వచ్చేసింది. బతుకుతానా లేదా అన్న అనుమానం వచ్చింది. అతని స్నేహి తుడు పోలీసులకు తెలియజేశాడు. వారు, విమానయాన సిబ్బంది అతని కోసం వెదికారు. వారికీ రెండు రోజులు అయితే గాని బెలూన్ అంతదూరం వెళిపోయిందని తెలియలేదు. అయితే అదృష్టవశాత్తూ హూ సెల్‌ఫోన్ ద్వారా అధికారులు హూ ఎంత దూరంలో ఉన్నది తెలుసుకోగలిగారు. హూకి వారు బెలూన్ నుంచి కిందకి రావడానికి కొన్ని సూచనలు చేశారు. దాని ప్రకారం హూ మెల్లగా దాని వేగం తగ్గించగలిగాడు. అలా దాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు.
కానీ అప్పటికే చాలా దూరంలో కిందకి వచ్చి పడింది. హూ భయంతో చుట్టూరా చూశాడు. అతను, బెలూన్, ఏకంగా చైనా, రష్యా సరిహద్దుల్లోని ఫాంగ్‌చెంగ్ ప్రాంతంలో పడ్డారు. రెండురోజుల నరకయాతన నుంచి సురక్షితంగా బయటపడ్డానని, అందుకు తన స్నేహితుడికి రక్షణశాఖ అధికారులకు ఎంతో కృతజ్ఞుడినని అన్నాడు హూ.