ప్రేమించి పెళ్లి.. ఆ తర్వాత భార్య బలి..
posted on May 3, 2021 8:57AM
మహిళల జీవితాలు సమస్యలతో , వేధింపులతో నిత్యం మండే స్మశానాలుగా మారుతున్నాయి. బయట సమాజంలో, ఇంట్లోనూ వారికీ తిప్పలు తప్పడం లేదు. అది ప్రేమించి పెళ్లి చేసుకున్న. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి ఏదైనా గానీ పెనిమిటి మంచోడు కోకపోతే ఆ మహిళ కు బాధలు తప్పడం తప్పడం లేదు. తన బాధలు చెప్పుకోవడానికి ఆ ఇంటి గోడలు చాలవు. ప్రేమించలేదని గొంతు కోసేవాడు ఒకడు. పెళ్లి చేసుకున్న తర్వాత మరింత ఎక్కువ వరకట్నం కోసం వేదించే మొగుడు. అన్నట్లుగా మారింది.
అది తెలంగాణ. హుజూర్ నగర్. సుందరయ్య కాలనీ కి చెందిన ఆత్కూరి సుజాత. ఆమె రెండో కూతురు మౌనిక. వయసు 19 సంవత్సరాలు. అదే ప్రాంతానికి చెందిన నాగరాజు ను ప్రేమించింది. ఇద్దరు మనసులు ఇచ్చుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అత్తకు నచ్చని అల్లుడైన, కూతురి భవిష్యత్తు కోసం వరకట్నం కింద 20 కుంటల పొలం ఇస్తానని చెప్పింది.
సరిగ్గా సంవత్సరం కింద మే నెలలో మౌనిక మేడలో మూడు ముళ్ళు పడ్డాయి. ఇద్దరు కలిసి ఏడు అడుగులు నడిచారు. సంవత్సరం అయినా వారి పెళ్ళికి వేసిన పందిరి ఇంకా తియ్యనేలేదు. అప్పుడు ఆ ప్రబుద్దుడుకి ఏం ఆలోచనలు వచ్చాయో ఏమో..? మొదటి పెళ్లిరోజు కూడా చేసుకోకముందే భర్త వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి సమయంలో వరకట్నం కింద 20 కుంటల భూమిని ఇచ్చేందుకు మౌనిక తల్లి అంగీకరించింది. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని రావాలని భర్త నాగరాజు కొంతకాలం నుంచి ఇంట్లో గొడవ స్టార్ట్ చేశాడు. తట్టుకోలేక పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది ఆత్కూరి మౌనిక. శనివారం సాయంత్రం పురుగుమందు తాగడంతో ఆమెను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు అర్ధరాత్రి మృతి చెందింది. ఈ మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. గొడవలు జరగకుండా పోలీసుల బందోబస్తు మధ్య భర్త నాగరాజుతో అంత్యక్రియలను పూర్తిచేయించినట్లు ఎస్సై చెప్పారు.