పాజిటివ్ అని తెలిసి.. బస్సు కింద తల పెట్టి..
posted on May 3, 2021 @ 9:39AM
అతని పేరు శ్రీనివాస్. గోదావరిఖని లో సూర్యనగర్ లో తన భార్య, తల్లి తో నివాసముంటున్నాడు. కుటుంబం గడవడం కోసం స్థానిక రెస్టారెంట్ లో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. చికిత్స పొందుతున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో ఆదివారం సీటీ స్కాన్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఆ వార్త వినగానే శ్రీనివాస్ గుండె బద్దలైయింది. సరైన వైద్యం తీసుకుంటే కరోనా తగ్గుతుందని ఆలోచించ లేక పోయాడు. మనోడు టెన్షన్ పార్టీ అనుకుంటా ఇంట్లో వాళ్లకు ఎవరికి చెప్పకుండా.. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్తున్నానంటూ ఇంట్లోంచి వచ్చి నగరపాలక కార్యాలయం సమీపంలో బస్సు వెనకచక్రం కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిగ్నల్ తర్వాత బస్సు బయల్దేరే సమయంలో ఒక్కసారిగా వెనకచక్రం కింద తల పెట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వారు తెలిపారు.
ఆక్సిజన్ అందక.. మరో ముగ్గురు మృతి..
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఉదయం ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఆక్సిజన్ అందకే వీరు మరణించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ముగ్గురు మృతిచెందడానికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
మరో ఇద్దరు ఇలా..
పొట్టకూటి కోసం, కూలికోసం వేరే రాష్ట్రానికి వెళ్లిన యువకులు కరోనా విరుచుకుపడుతున్న కారణంగా తమ సొంత రాష్ట్రానికి పయనమయ్యారు ఇద్దరు యువకులు. అందుకోసం మహారాష్ట్ర నుంచి ఒడిశాకు స్కూటీపై సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధపడ్డారు. ఆ ప్రయాణం మధ్యలోనే ముగిసిపోయింది. వారి సుదీర్ఘ ప్రయాణం వారిని అనంతలోకానికి తీసుకుళ్లింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని బలితీసుకుంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పి.ఎల్.పురం వద్ద ఆదివారం జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఏఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. వీరు ప్రయాణిస్తున్న వాహనం పి.ఎల్.పురం వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులకు రెండు కాళ్లు విరిగిపోయి బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధార్‌కార్డుల చిరునామా ఆధారంగా మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
పాదచారులను ఢీకొన్న కారు..ఇద్దరి మృతి..
పాదచారులను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం వెంకటాపురంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. మృతులను తూర్పుగోదావరి జిల్లా వంగలపూడికి చెందిన కె.నాగరాజు, డి.కాంతారావుగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇలా రోజు కరోనా కారణం గా కాకుండా చాలా మంది యాక్సిడెంట్ జరిగి, పరీక్షలు తప్పమని, ఇంట్లో అమ్మానాన్నలు తిట్టారని, అమ్మాయి ప్రేమించలేదని. పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని. పెళ్ళాం వేరే వాడితో అక్రమసంబంధం పెట్టుకుందని ఇలాంటి సంఘటనల్లో చనిపోతున్న వాళ్ళు మన దేశం రోజుకు కుప్పలా కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి మరణాలతో పోలిస్తే కరోనా మరణాలు ఇచ్చు మించు తక్కువే అని చెప్పుకోవచ్చు అంటున్నారు ప్రముఖులు.