కడుపులో 59 అడుగుల పురుగు..
posted on Mar 26, 2021 @ 3:40PM
పురుగులు భూమి పైనే కాదు.. కడుపులోని ఉంటాయి.. వాటిని ఒక్కొక ప్రాంతంలో ఒక్కక పేరుతో పిలుస్తారు.. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నట్టల పురుగులు అని. మరికొన్ని చోట్ల నులిపురుగులు అని పిలుస్తుంటారు. ఈ పురుగులు కడుపులో చేరి ఆకలి కానివ్వవు నిత్యం కడుపులో మంట.. కడుపు ఉబ్బరం పుడుతుంది. అలాంటిది 67 ఏళ్ళ వ్యక్తి కడుపులో ఓ వ్యక్తి కడుపులో 59 అడుగుల నులిపురుగు బయటకి తీశారు వైద్యులు.
యాంగ్ ఖాయ్ ప్రావిన్స్‌లో 67 ఏళ్ల ఆ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పి, కడుపు ఉబ్బరంతో బాదపటున్నాడు. ఆ నొప్పి భరించలేక ఓ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్ ప్రకారం ఆ వ్యక్తి మలంలో 28 పరాన్నజీవుల గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. అనంతరం ఆస్పత్రిలో ఆ వ్యక్తికి నులిపురుగులను బయటకు పంపే మందు ఇచ్చారు. తర్వాతి రోజు ఆయన కడుపులో నుంచి మన దేశంలో రేషన్ షాప్ ముందు నిలబడే లైన్ లా ఒక భారీ నులిపురుగు బయటకు వచ్చింది. పచ్చి మాంసాన్ని, సరిగా ఉడకని మాంసాన్ని తినడం వల్ల కడుపులో నులిపురుగులు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు. ఈ వింత సంఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది.