కౌగిలింతలకు ఇన్ని అర్థాలున్నాయా?

కౌగిలి ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక బంధాన్ని తద్వారా మానసిక బంధాన్ని కూడా బలపరుస్తుంది. ముఖ్యంగా జీవిత  భాగస్వాములు ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల వారి మనసులో ఉన్న విషయాలను బయటకు తెలియజేస్తుంటారు. ఒక గట్టి కౌగిలి భాగస్వాముల మధ్య ఉండే అపార్దాలను, కోపతాపాలను, పొరపొచ్చాలను మాయం చేస్తుంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా భాగస్వాములు  కౌగిలించుకోవడం మంచిదేనని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు. అయితే కౌగిలి లోనూ రకాలున్నాయని. వాటికి బోలెడు అర్థాలున్నాయని తెలిసింది. ఇంతకీ ఎలా కౌగిలించుకుంటే ఏమర్థమో తెలుసుకుంటే..

ఎదురుగా భుజం మీద వాలి కౌగిలించుకుంటే..

ఒకరికొకరు ఎదురుగా కౌగిలించుకున్నప్పుడు జీవిత భాగస్వామి భుజం మీద తలను పెట్టుకోవడానికి ఇష్టపడితే వారు ప్రేమను ఆశిస్తున్నట్టు.  ఇద్దరి మధ్య అవగాహన, అర్థం చేసుకునే గుణం మెండుగా ఉన్నట్టు. ఇది ఒకానొక సురక్షిత భావనను అందిస్తుంది.

వెనుక నుండి కౌగిలించుకుంటే..

వెనుక నుండి కౌగిలించుకోవడం వల్ల భార్య లేదా భర్త చాలా  మిస్సవుతున్నారని అర్థమట. అదే విషయాన్ని చెప్పడానికి వెనుక నుండి కౌగిలించుకుంటారట.  ఒకవేళ ఎప్పుడూ ఇలాగే కౌగిలించుకుంటూ ఉంటే ఎప్పుడూ ప్రేమను కోరుకుంటున్నారని అర్థమట.

భుజాలను పెనవేసుకుని కౌగిలించుకుంటే..

భుజాలను పెనవేసుకుని కౌగిలించుకుంటే ఆ కౌగిలిలో ప్రేమ, నమ్మకం పాళ్లు ఎక్కువ ఉన్నాయని అర్థం. అలాగే ఆ భాగస్వాముల మధ్య శృంగార జీవితం కూడా బాగా ఉన్నట్టు. ఈ కౌగిలి ద్వారా ఇద్దరి మధ్య రొమాంటిక్  ఫీలింగ్ మరింత పెరుగుతుంది.

గట్టి కౌగిలి..

జీవిత భాగస్వాములు ఒకరినొకరు దగ్గరగా, గట్టిగా రెండు చేతులతో కౌగిలించుకుంటే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరగా ఉండాలని, ఎప్పటికీ విడిపోకూడదని కోరుకుంటున్నారని అర్థం. ఒకరినొకరు తీవ్రంగా  ఇష్టపడటం ఈ కౌగిలి  తెలుపుతుంది.

ఒక చేత్తో కౌగిలించుకుంటే..

ఒక చేత్తో కౌగిలించుకుంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్నేహ భావాన్ని సూచిస్తే.. రెండోది బహిరంగంగా కౌగిలించుకోవడం ఇష్టం లేదని తెలపడం. ఇది నిబద్దతకు, సామాజిక అవగాహనకు సంబంధించినది.

                                           *నిశ్శబ్ద.