నిద్రలేమితో బాధపడుతున్నారా?
posted on May 2, 2018 @ 10:42AM
ఈ సమస్యను ' పూర్ స్లీప్ కన్సాలిడే షన్ ' అంటారు. అంటే బెడ్ పైనే ఎక్కువ సేపు గడుపుతారు కాని, నిద్రపోయే సమయం తక్కువ,చాలదు. ఈ పరిస్థితి తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు,శ్రద్ధ అవసరం. బెడ్ టైమ్ కు ముందుగా కునుకులు తీయకండి. బాగా అలసటగా,నిద్ర వస్తున్న ఫీలింగ్ కలిగి నపుడే పడుకోవాలి. ఒత్తిడి ఏమాత్రం లేనపుడే పడక పైకి చేరాలి. ఏవైనా విషయాలు ఆందోళన కలిగిస్తుంటే మంచం దిగేసి మనస్సు మళ్ళించాలి. తిరిగి నిద్ర వస్తున్నప్పుడే పడుకోవాలి. వీకెండ్స్ అయినా సరే వేళ ప్రకారం నిద్రలేస్తుండాలి. రాత్రి లేట్ అయిందనే కారణంతో నిద్రలేచే సమయాన్ని పొడిగించు కోవద్దు. మద్యాహ్నం వేళ ఎక్కువ నిద్ర పోవద్దు.
ఇరవై నిమిషాల కునుకుచాలు. అదికూడా మద్యాహ్నం మూడు నాలుగు గంటల మధ్యలోనే. ఇవన్ని పాటించండి ,నెమ్మదిగా సమస్య తగ్గిపోయి నిద్రించే సమయాలు క్రమబద్ధం అవుతాయి. చక్కటి నిద్ర ,ఆహ్లాదభరితమైన ఉదయం మీ సొంతం అవుతాయి.
...సాయి లక్ష్మీ మద్దాల