నకిలీ పనీర్ కనిపెట్టడానికి సూపర్ టిప్స్ ఇవి..!
posted on Nov 24, 2025 @ 2:37PM
శరీరానికి శక్తిని ఇవ్వడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు.. ఇలా అన్ని రకాలు అవసరం అవుతాయి. ఇలా అన్ని కలగలిసిన ఆహారాన్నే సమతుల ఆహారం అని అంటారు. ముఖ్యంగా ప్రోటీన్ మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది. కానీ శాకాహారులు ప్రోటీన్ కోసం పనీర్, పాలు, కాయ ధాన్యాలు మొదలైన వాటి మీద ఆదారపడతారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం కల్తీ అవుతున్న పదార్థాలలో పనీర్ ఏ ప్రథమ స్థానంలో ఉంది. మరొకవైపు పనీర్ కు ఆధరణ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో అసలు పనీర్ ఏది? నకిలీ పనీర్ ఏది? దీన్ని కనుక్కోవడానికి సహాయపడే సూపర్ టిప్స్ ఏవి? తెలుసుకుంటే..
శాకాహారులు ప్రోటీన్ కోసం పనీర్ ను ఎక్కువగా తీసుకుంటారు. పనీర్ రుచిగా ఉండటమే కాకుండా శక్తిని, బలాన్ని కూడా సమృద్దిగా అందిస్తుంది. కానీ మార్కెట్లో చాలా రకాల నకీలీ పనీర్ అమ్ముతుంటారు. దీన్ని కనుక్కోవడానికి ముఖ్యమైన నెంబర్ వన్ టిప్.. వాసన.. పనీర్ ను పాల నుండి తయారు చేస్తారు. అందువల్ల పనీర్ పాల వాసన వస్తుంది. అలా కాకుండా పనీర్ ఏదైనా రసాయనాల వాసన వస్తుంటే అది నకిలీ పనీర్ అని గుర్తించాలి.
కొన్నిచోట్ల పనీర్ ను అప్పటికప్పుడు పెద్ద పెద్ద కేక్ ల నుండి కొద్ది కొద్దిగా కట్ చేసి వెయిట్ ప్రకారం అమ్ముతారు. ఇలాంటి చోట పనీర్ ను కొనుగోలు చేస్తుంటే సింపుల్ గా చిన్న ముక్క పనీర్ ను రుచి కోసం అడిగి తీసుకుని తిని చూడాలి. నిజమైన పనీర్ అయితే మృదువుగా, రుచిగా ఉంటుంది. అదే నకిలీ పనీర్ అయితే తిన్నప్పుడు కూడా కాస్త వింత వాసన వస్తుంది
నిజమైన పనీర్ ను తురిమినప్పుడు లేదా చేత్తో నలిపినప్పుడు మృదువుగా, సులువుగా మెత్తగా గుజ్జులాగా అవుతుంది. అయితే నకిలీ పనీర్ అలా ఉండదు. ఇది రబ్బర్ లాగా, కొంచెం గట్టిగా ఉంటుంది.
పనీర్ నకిలీదా, నిజమైనదా తెలుసుపోవడానికి మరొక సూపర్ టిప్ ఉంది. పనిర్ ను నీటిలో మరిగించి పిండి లేదా సోయా బీన్ పిండిని కలపాలి. ఇలా చేసినప్పుడు పనీర్ ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్ నకిలీదని అర్థం. ఎందుకంటే నిజమైన పనీర్ ఈ ప్రాసెస్ లో రంగు మారదు.
పనీర్ నకిలీదా లేదా నిజమైనదా కనుక్కోవడానికి అయోడిన్ పరీక్ష కూడా నిర్వహించవచ్చు. పనీర్ ను వేడినీటిలో సుమారు 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ తరువాత కొన్ని చుక్కల అయోడిన్ టింక్చర్ జోడించాలి. ఇలా జోడించిన తరువాత రంగు నీలంలోకి మారితే ఆ పనీర్ నకిలీదని అర్థం.
ప్యాకింగ్ చేసిన పనీర్ ను కొనుగోలు చేసేటప్పుడు దాని ఎక్స్‌పైరీ డేట్ ను చెక్ చేయాలి. అదే విదంగా పనీర్ ప్యాకెట్ పైన పనీర్ తయారీలో ఉపయోగించిన పదార్థాల లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ను కూడా చెక్ చేయాలి. ఇది పనీర్ నకిలీదా లేదా అసలైనదా తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...