కొంప ముంచిన పేస్ బుక్..
posted on Apr 17, 2021 @ 11:51AM
అతని పేరు తారక మహేష్. అతడు ఓ మగాడు. ఆమె ఒక ట్రాన్స్ జెండర్. ఇద్దరు పేస్ బుక్ లో ముందు చాటింగ్ చేశారు. ఒకరి నొకరు ఇష్టపడ్డారు. ఆమె ట్రాన్స్ జెండర్ అని తెలిసి కూడా ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఎల్‌బీ నగర్ లో ఉంటున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వరకట్నం వేధింపులు చేశాడు. దీంతో ఎల్ బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లాడు.
కట్ చేస్తే.. ఇటీవల జైలు నుంచి విడుదలైన తారక మహేష్ తన భార్య మరో ఫేస్ బుక్ వినియోగిస్తున్నట్టు గుర్తించాడు. దీంతో తన స్నేహితుడు మొబైల్ ఫోన్ ద్వారా ఫేక్ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేసుకున్న మహేష్.. భార్యను వేధించసాగాడు. వివిధ రకాల అసభ్యకర సందేశాలతో పాటు అశ్లీల ఫోటోలు, వీడియోలు సెండ్ చేశాడు. ఫేస్ బుక్ లో వేధింపులపై బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, భర్తే వేధించినట్టుగా పోలీసులు నిర్థారించారు. దీంతో నిందితుడు మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ పి.యాదగిరి, ఏసీపీ హరినాథ్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ ఎం.శంకర్ లను సీపీ అభినందించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో జరిగింది.