గ్యాస్ట్రిక్ తలనొప్పి అంటే ఏంటి? ఇది తగ్గాలంటే ఏం చేయాలి?

తలనొప్పి అనేది ఎవరికైనా వచ్చే సమస్య. కానీ తలనొప్పి వల్ల ఒక్కొక్కరు ఒక్కోలా ఇబ్బంది పడతారు.  కొన్నిసార్లు ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది.   సరిగ్గా నిద్రపోలేరు అలాగని ప్రశాంతంగా  మెలకువగా ఉండలేరు కూడా.  ఈ రకమైన తలనొప్పిని సాధారణ తలనొప్పిగా భావించలేం.  దీన్ని  గ్యాస్ట్రిక్ తలనొప్పి అని చెప్పవచ్చు. గ్యాస్ట్రిక్ తలనొప్పి కడుపుకు సంబంధించినది. ఇందులో పొట్టలో గ్యాస్ ఏర్పడి క్రమంగా తలకు  ఎక్కి ఆ తర్వాత తలనొప్పికి దారితీస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో పోరాడుతున్నట్లయితే, గ్యాస్ట్రిక్ తలనొప్పి అంటే ఏమిటి?  దాని నుండి ఉపశమనం పొందడం ఎలాగో తెలుసుకుంటే..


గ్యాస్ట్రిక్ తలనొప్పి.


గ్యాస్ట్రిక్ తలనొప్పిలో ఒక వ్యక్తి తలనొప్పితో పాటు గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అజీర్ణం,  పేలవమైన జీర్ణక్రియ, ముఖ్యంగా కడుపు,  ప్రేగులలో సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఆహారం జీర్ణం కానప్పుడు, కడుపులో గ్యాస్ ఏర్పడటం ప్రారంభమవుతుంది.  దీని కారణంగా తలపై ఒక వైపున నొప్పి మొదలవుతుంది.


లక్షణాలు..

వికారం మరియు వాంతులు,  కడుపు నొప్పి లేదా తిమ్మిరి.  అపానవాయువు,  అజీర్ణం,  యాసిడ్ రిఫ్లక్స్, అతిసారం లేదా మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి.


గ్యాస్ట్రిక్ తలనొప్పి ఎందుకు వస్తుంది..


చెడిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ తలనొప్పి వస్తుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.  ఇది అసౌకర్యం,  తలనొప్పికి దారితీస్తుంది. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం,  తలనొప్పికి దారితీస్తుంది. తగినంత నీరు త్రాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది గ్యాస్ట్రిక్ తలనొప్పికి కారణమవుతుంది. ఋతుస్రావం,  గర్భధారణ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా గ్యాస్ట్రిక్ తలనొప్పికి కారణం.


నివారణలు..


పిప్పరమింట్ టీ..

ఒక కప్పు పిప్పరమెంటు టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది కడుపు నొప్పి,  అజీర్ణానికి చికిత్స చేస్తుంది.

తులసి ఆకులు..


6-7 తులసి ఆకులను నమలడం వల్ల కడుపు ఉబ్బరం,  గ్యాస్ తగ్గుతాయి. ఇది తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నిమ్మరసం,  గోరువెచ్చని నీరు..


నిమ్మరసం,  గోరువెచ్చని నీరు ఒత్తిడి,  కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.


ఫెన్నెల్..


సోపు గింజలు ఉబ్బరం, గుండెల్లో మంట, గ్యాస్,  ఆకలి లేకపోవడం నుండి ఉపశమనం కలిగిస్తాయి.

చమోమిలే..


చామంతిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కడుపు తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది.


                                                *రూపశ్రీ.